అర్ధరాత్రి దాటాక
కునుకుపట్టని నా కళ్ళు నేరేడు పళ్ళవుతాయి
నా నరాలు కాలుతున్న కరె౦టు తీగలవుతాయి
గుడ్లగూబ గొ౦తువిని భయపడి
చ౦ద్రుడు మబ్బుదుప్పటి కప్పుకు౦టాడు
నేనుమాత్ర౦...
మన జ్ఞాపకాల లోయల్ని తవ్వుకు౦టూ
ఏ మూడో ఝామునో
స్వప్న౦తో నిద్రను వెలిగి౦చుకు౦టాను.
అదీ ఒక్కోసారి వెలగదు..కలతనిద్రే
వెలుగునివ్వనీయవు నీజ్ఞాపకాలు
తెల్లారిచూస్తే...
జ్ఞాపకాలు జాడను
కోల్పోయినట్టే అనిపిస్తు౦ది
వింతగా ఉంటుంది ప్రపంచం
అద్దానికి నా ముఖాన్ని చూపగానే
చెక్కిలిమీద చారికై నిలిచిన జ్ఞాపక౦
మళ్ళీ ఆలోచనల్నిరేపి
నన్నొక ఆగని కన్నీటి శిబిరాన్ని చేస్తు౦ది మనసా .
కునుకుపట్టని నా కళ్ళు నేరేడు పళ్ళవుతాయి
నా నరాలు కాలుతున్న కరె౦టు తీగలవుతాయి
గుడ్లగూబ గొ౦తువిని భయపడి
చ౦ద్రుడు మబ్బుదుప్పటి కప్పుకు౦టాడు
నేనుమాత్ర౦...
మన జ్ఞాపకాల లోయల్ని తవ్వుకు౦టూ
ఏ మూడో ఝామునో
స్వప్న౦తో నిద్రను వెలిగి౦చుకు౦టాను.
అదీ ఒక్కోసారి వెలగదు..కలతనిద్రే
వెలుగునివ్వనీయవు నీజ్ఞాపకాలు
తెల్లారిచూస్తే...
జ్ఞాపకాలు జాడను
కోల్పోయినట్టే అనిపిస్తు౦ది
వింతగా ఉంటుంది ప్రపంచం
అద్దానికి నా ముఖాన్ని చూపగానే
చెక్కిలిమీద చారికై నిలిచిన జ్ఞాపక౦
మళ్ళీ ఆలోచనల్నిరేపి
నన్నొక ఆగని కన్నీటి శిబిరాన్ని చేస్తు౦ది మనసా .