నిన్ను గుచ్చే బాణం,
నిన్ను చేదించే బాణం ,
నిన్ను బాదించే బాణం.
మలినం లేని నవ్వును,
కాల్చి మాడ్చి వేసి,
ముఖానికి మసి పూస్తుంది.
కళ్ళలోని కాంతిని ,
వెతికి,వెతికి కోసి,
నేల చూపుల్లోకి విసిరేస్తుంది.
నిన్ను వేదించి,
వెటకారంతో శోదించి,
ఎదుట పడకుండా చేస్తుంది.
మాటల తూటాలతో,
ముఖం లో నవ్వును,
మాయం చేస్తుంది.
నీ చితిమంటల్లో,
ఎవరి ఆకృతినో వెతికి,
నీ తలపులనూ తరిమేస్తుంది.
గురి చూసి వదిలిన,
అనుమానపు శరం,
గుండెనే చీల్చుతుంది.
- By Meraj Fathima Garu
నిన్ను చేదించే బాణం ,
నిన్ను బాదించే బాణం.
మలినం లేని నవ్వును,
కాల్చి మాడ్చి వేసి,
ముఖానికి మసి పూస్తుంది.
కళ్ళలోని కాంతిని ,
వెతికి,వెతికి కోసి,
నేల చూపుల్లోకి విసిరేస్తుంది.
నిన్ను వేదించి,
వెటకారంతో శోదించి,
ఎదుట పడకుండా చేస్తుంది.
మాటల తూటాలతో,
ముఖం లో నవ్వును,
మాయం చేస్తుంది.
నీ చితిమంటల్లో,
ఎవరి ఆకృతినో వెతికి,
నీ తలపులనూ తరిమేస్తుంది.
గురి చూసి వదిలిన,
అనుమానపు శరం,
గుండెనే చీల్చుతుంది.
- By Meraj Fathima Garu