. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, April 30, 2013

ఊసులాడే ఓ జాబిలమ్మ.....మూగబోయావెందుకమ్మా!!


 
ఊసులాడే ఓ జాబిలమ్మ
మూగబోయావెందుకమ్మా!!
నీ వెండి వెన్నెల జారనీయక
జలతారు పరదాలను మబ్బుల మాటున
అడ్డుగా పరిచావెందుకు?
మసక వెన్నెల మాటున
చిరు దీపపు కాంతిలో
ఆరుబయట చల్లగాలికి పిల్లతెమ్మెరలా
ఒక్క మారు పలకరించి పోరాదా!!
నీ జాడ లేక బోసిబోయిన నింగిని చూసి
పక్కున నవ్వే నిశి రాతిరి...
చిన్నబోయిన కలువల కమలాలు...
ఎదురు చూసి ఎదురు చూసి
అలసి సొలసి విసుగుతో వేసారి
కానరాని నీ జాడకై కొమ్మల రెమ్మల మాటున
మసక మబ్బుల్లో నీ కోసం ఆశగా చూసేను...... !!

స్నేహం అనేది ప్రతి ఒక్కరికి ఆ దేవుడిచ్చె గొప్ప వరం.


 
స్నేహం అనేది ప్రతి ఒక్కరికి ఆ దేవుడిచ్చె గొప్ప వరం. అలా అనుకోని నేను స్నేహమే నా ప్రాణంగా భావించాను. స్నేహితుల సంతొషమే నా కర్తవ్యం అనుకున్నాను. వారి భాధలు నా భాధ్యతనుకున్నాను. నా కుటుంభం కన్నా స్నేహానికే ఎక్కువ విలువిచ్చాను. నా సంతొషాలు, బాధలు , చిన్ని చిన్ని రహస్యాలు అన్ని వాల్లతొ పంచుకున్నాను. వాల్ల సంతొషమే నా ఊపిరిగా భావించాను . కాని చాలా ఆలస్యంగా నేను తెలుసుకున్నాను, అవసరం కొసమే స్నేహం , అవసరం తీరాక వేరే లోకం. ఏ బంధం లేకున్నా రెండు హ్రుదయాలు జీవితాంతం కలిసుండేదే స్నేహం. స్నేహానికి విలువిచ్చి నమ్మకం పెంచుకున్నాను. కాని ఆ నమ్మకాన్ని వమ్ము చేసి స్నేహం విలువ తీసే వాల్లే చాలా ఎక్కువైపొయారు . అలాంటి స్నేహం చేసి స్నేహానికి ఉన్న విలువను, గొప్పతనాన్ని పోగొట్టొదని వేడుకుంటున్నాను. దయచేసి అవసరం కొసం స్నేహం చేయకండి, స్నేహాన్ని అవసరానికి వాడుకోకండి. స్నేహానికి ఉండే విలువని , గొప్పతనాన్ని , స్నేహం మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. అలాంటి స్నేహాలు నా జీవితంలొ మల్లి ఎదురవకూడదు అని ఆ దేవున్ని ప్రార్థిస్తు సెలవు.........ఇవన్నీ నిజాలేనా ...?
 -------------------------->

నీకు నేనున్నానంటూ నమ్మంచి స్నేహం అనేది ఓ నిజంలా బ్రమించి..ఆతరువాత నీవెవరని ప్రశ్నించి ...మరొకరిదగ్గర నను వెటకారంగా మాట్లాడి.. అవమానిస్తున్న స్నేహాన్ని ఏమనాలి ...గుండె తట్టుకోలేదని తెల్సి...తన స్వార్దం కోసం ఎన్నిమాటలైనా అనే స్నేహాన్ని ఏమనాలి  తనవల్ల ఎదుటి మనస్సు గాయపడుతుందని తెల్సి ...అయితే నాకేంటి ...ఎవ్వరెటుపోతే నాకేంటి నాస్వార్దం నాది అని తన ఆనందం చూసుకుంది కాని ఎదుటి మనిషి మనసును తట్టుకోలేని గాయం చేస్తున్నా అని తెల్సి..స్వార్దం  చూసుకొని పరుదులు ఎల్లలు పెట్టి ఎవడికోసమో అవమానిస్తూ...ఎవరో తనగురించి మంచిగ చెప్పుకోవాలని అవమానిస్తున్న స్నేహాన్ని ఏమనాలి ఆ ఎవడో నాకన్నీ తెల్సేలా చేస్తూ వెటకారంగా మాట్లాడిన క్షనాన ఏం చేయాలో తెలియక నమ్మిన స్నేహం చేసిన అవమానాన్ని తట్టుకోలేక భాద పడుతున్నారని తెల్సి .. తన స్వార్దం చూసుకొని తన ఆనందంకోసం ఏమనటానికైనా సిద్దపడ్డ  స్నేహాన్ని ఏమనాలి మనసాక్షిని చంపుకొని చేస్తున్నావా తెల్సిచేస్తున్నావా తెలియక చేస్తున్నావా చెప్పవా..?

నీకు నేనున్నా అని ఎప్పుడు గుర్తిస్తావో ప్రియా



 

సూర్యోదయం లో ఉషస్సుని ,చంద్రోదయం లో వెన్నెల ని.....
వీచే గాలిలో హాయిని ....పారే గోదావరి గలగలని ...
మెరిసే చుక్కల తళుకుల ని.....కురిసే వాన జల్లుల ని......
అమ్మ ఒడిలోని వెచ్చదనాన్ని ....నాన్న పంచిన ప్రేమని ..

ఎన్నో కలలతో మరెన్నో కోరికలతో ..
అంతులేని ఆత్మాభిమానం తో ...అర్ధంకాని అమాయకత్వం తో ...
స్వచ్చమైన మనసుతో .....అచ్చతెలుగు సోయగాలతో
కొంటెగా అల్లరిచేస్తూ....కసిగా పోట్లాడేస్తూ
నవ్వుతు నవ్విస్తూ....అరుస్తూ అరిపిస్తూ
కోపంలో అలుగుతూ.....బాధలో ఓదారుస్తూ

మొండిగా వాదిస్తూ....నచ్చిందే చేస్తూ
ప్రేమను పంచే మనసుతో ...
కలగలిసిన అచ్చమైన బాపు బొమ్మ .
ప్రేమను గెలుచుకునే సహనం తో.... మన 16 అణాల తెలుగుఅమ్మాయి...?

రేయింబవళ్ళూ నీ ధ్యానం నన్ను నిలువెల్ల రగిలించె నీ మౌనం

రేయింబవళ్ళూ  నీ ధ్యానం
నన్ను నిలువెల్ల రగిలించె నీ మౌనం
నీ చూపు నా పాలిట మరణ మృదంగం
నిను చూడక కదలాడునా నా ప్రాణం

నిదురబోయిన మనసును మేల్కొలిపావు
నా జీవన గమనానికి స్ఫూర్తిగ నిలిచావు
నిదురేరాని కనులకు ఓదార్పువైనావు
వేదన మరపించి ప్రశాంతిని నింపావు

కరిగిపోని స్వప్నమా...
ఆత్మీయ బంధమా..
జాబిలివై జాలిగా నన్ను. 
సేదదీర్చు నేస్తమా..
 
నాకిక శక్తిలేదు అశక్తుడను చేసి
ఆడుకుంటున్నావు నామనస్సుతో
ఏదైనా నీకు సాద్యిం ప్రియా ఏదైనా చేయగలవు
నీండా స్వార్దం నిండీన మనిషివి ఇప్పుడూ నీవు

ఎవరిదగ్గరో నీవు మంచి అనిపిచుకొనేందుకు నన్ను అవమానిస్తున్నావెందుకో ప్రియా

నేస్తమా
నిన్నటి వరకూ  ప్రాణ స్నేహితులం
కానీ... ఈ రోజు ప్రాణమే
మిగిలింది... స్నేహం కాదు
కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...
మరపురాని మన
స్నేహాన్ని గతంగా మార్చేసింది
ప్రతి క్షణం నీవులేని లోటును 

తెలుపుతూనే వుంది
కష్టమొచ్చినప్పుడు
కన్నీటి కంటే ముందు
నేనున్నానని గుర్తుంచుకో...
మనుషులు విడిపోవచ్చు...
మనసులు ఓడిపోవచ్చు...
మమతలు మాసిపోవచ్చు... మారనిది
స్నేహమొక్కటే..
ఔను...నిజమే,, ఇప్పటికీ ఏం మారలేదు...  

నేనెవరో తెలీనట్టు అసలు నాపరిచయమేలేనట్టు 
నీ ఉన్నావు
అప్పటినుంచి నాలో నేను 
కుమిలిపోతూనే ఉన్నా ప్రియా
నువ్వు గుర్తొచ్చినప్పుడు
చిరుగాలి కన్నా చల్లని నీ చిరునవ్వు 

నను పలకరించి పోతుంది
నీవు నన్ను వీడి వీడి పోయిన విషయం గుర్తుకొచ్చి
గుండెలదిరేలా ఒక్కడినే ఏడుస్తున్నా ఏం చేయలేక
ఎవరిదగ్గరో నీవు మంచి అనిపిచుకొనేందుకు
నన్ను అవమానిస్తున్నావెందుకో ప్రియా
నీకందరూ మంచివాళ్ళే నేను తప్ప
వాళ్ళందరికి రెస్పెక్ట్ ఇస్తావు ఒక్క నాకు తప్ప
నిజం ఇలా నన్నే నాగుండెను వేదిస్తుంది ప్రియా

నీవు నా నాతో మాట్లాడుతుంటే ఆకాశాన్ని హత్తుకున్నంత ఆనందం

ఈ రోజు ఆరంజ్ 
సినిమా పాటలు వింటుంటే

నీవే గుర్తుకు వచ్చావు ..

పచ్చని ప్రకృతిసాక్షిగా
మనిద్దరం కార్లో వెలుతున్నప్పుడు 

"..నీవు నాతో మాట్లాడుతుంటే
ఆకాశాన్ని హత్తుకున్నంత ఆనందం 
నీవు నా వైపు చూస్తే 
మనసు లోకమై విహరిస్తుంది 
సముద్రమై నిన్ను స్పృశిస్తుంది 
నువ్వు నా భుజంపై వాలిపోతే 
అనంతపు జీవితాన్ని మోసినట్టుగా 
హృదయం దూది పింజెలా మారిపోతుంది 
ఏదో ఒక సమయంలో 
నీకోసం నిరీక్షించేలా చేసే నీ వాలు చూపు 
నన్ను వివశుడిని చేస్తుంది 
గుండెల్లో ప్రేమ విత్తనం నాటుతుంది 
నాకోసమే నీవు పుట్టావేమొ అనిపిస్తుంది
అవును ..నీ మీద నేను వాలిపోయి 
చందమామను చూస్తూ ..
పుడమి వెన్నెలను 
చేతుల్లోకి  తీసుకుని ...
నిన్ను ముద్దాడాలని ఆవేశపడే వాన్ని 
నువ్వు ..నేను ఒకే నాదమై
ప్రేమ వర్షంలో తడిసి పోయినట్టు 
కల నన్ను కుదిపేస్తోంది 
అవును .. నిన్నటి దాకా 
నేను మనిషిగా ప్రయాణం చేశా 
కానీ ..నీతో స్నేహం కలిగాకా
ప్రేమైక జీవిగా మారిపోయా .."
మరిప్పుడు నేనుఎందుకు  ఒంటరిగా మిగిలిపోయా  
ఆశాడిష్టుగాడిని నమ్మావు
మరినేనేం తప్పుచేశాను నటింఛడం చేతకాకపోతే
మనసును ఏమార్చలేకపోతే ఇలా మిగిలి పోవాల్సిందేనా

నిశ్శబ్ధం...ఒంటరిగా...నాకు నేనుగా ...కాలుతున్న వాసన...

నిశ్శబ్ధం

ఒంటరిగా
నాకు నేనుగా  
కాలుతున్న వాసన...
 
చెవిలో ఏదో 
సీసంపోసినట్టూగా ఏదీ వినబడనితనం  ఒక్కోమారు గుండె బిగుసుక పోతుంది
కంట్లో రెటీనాపై కన్నీటి తెరకప్పి లోలోపల ఏవో శూన్య రేఖలు 

గుండెపై పదునైన కత్తితో బర బరా గీస్తున్నట్టు...
నాలో నేను ఓ నిశ్శబ్ధ చెట్టుక్రింద ఒంటరిగా మూగి గుస గుసలాడుతున్నట్టు...
నా దేహాన్ని గుండ్రని  బంతిలా మారి దొర్లుకుంటూ  కొండల్లో గుట్టల్లో పారేస్తే
అది లా గమ్యిం తెలీక వెలుతుంటే
రక్తంఓడుతున్న శరీరంతొ అలా ఏటో పోతున్నా

అస్సలు గాలి వీయని తనంతో  అంతా మూగగా ఉగ్గబట్టి  
వేసవితనం మిట్ట మద్యాన్న ఎమౌతుందో తెలీక
అలలన్నీ బంద్ చేసి  ఒడ్డుకందని 
దూరంతో సముద్ర గర్భంలో నిదుర పోయినట్టు...  
నాజీవితం నేనుజీవిస్తుంటే
నీ అంతతట వచ్చి నన్నిలా చేసి
మౌనం అనే కత్తులతో గుండెను కోస్తూ
నీవేంసాదించావో తెలీక
అవమానిస్తే నీకానందమైతే
అవమానించు తలవంచానుకదా నీ ఇష్టం
శాడిష్టును నమ్మావు నన్ను తప్ప
ఆకాశాంలో కి అన్నీ పోగొట్టుకున్నట్టూ
చూడటం తప్ప ఏం చేయగలను ప్రియా 

Monday, April 29, 2013

రతీదేవిలా నాలా నీవేదో వెతుకుతున్నావు ఆప్పుడేం జరిగిందంటే ( పెద్దలకు మాత్రమే )

తమకంతో ఏదో వెతుకుతూ 
నాకోసం నిన్ను ఎక్కడెక్కడో తడుముతున్నా
కాని కావల్సినది దొరకలేదు.. చిక్కాల్సింది చిక్కలేదు
అవసరమో అవకాశమో .. ఒక్కసారికీ నా శరీరంలో
1000 ఓల్టుల విద్యుత్ ప్రవాహం..
అది వచ్చింది ఇచ్చింది నీవే...
అప్పటిదాక అచేతనంగా వున్న నీవు  

నావెతుకులాటలో ...
నేను నీ  శారీరంలో ఏక్కడో స్విచ్ నొక్కాను
చీకట్ళో ఏంటో తెలీల విద్యుత్ షాక్ కొట్టాక 

నేను ఎక్కడున్నానో  అర్దం అయింది
నీ ఎదపరువాలపై సుతిమెత్తగా కదిలిన 

నా చేతుల్లో ఒదిగిపోయిన ఆ పరువం
నేను నీ గుండెల మీదికి చేరినపుడు 
నువ్వు విడిచే ఆ ఉచ్చ్వాస నిశ్చ్వాసలకు 
నా ఒంట్లో వేడి రాజుకుంటుంటే.. దాన్ని ఎలాగైనా ఆపాలని.. 
ఎలా ఆపాలో తెలియక... 
ఆపడానికి నా వద్ద ఎలాంటి 
ఆయుధాలు లేక.. 
అమాయకంగా.. 
నా అధరాలనే ఆయుధాలుగా మలచుకొని 
నీ అధరాయుధాలపై గురిపెట్టినపుడు.. 
నా ఒంట్లో ఒక చిన్న నిప్పు రవ్వగా వెలిగి
నేను విరహంతో భాగ భగ మండే సూర్యుడిగా రగిలిపోతున్నా 
తమకపు వేడి రాజుకుని.. 
నీ ఒంటిని కూడా రగిలించిందని తెలుసుకున్నాక 
నిన్నెలాగైనా నా వశం చేసుకోవాలనే ఆవేశంతో.. 
నిన్ను నాలో ఐక్యం చేసుకోవాలనే తహతహలో.
 నీవు కూడా నన్ను పూర్తిగా ఆక్రమించుకొని
నీలోపలకి నన్ను దించేస్తున్నావు..లోతులు వెతికే కోద్ది
ఇంకా ఎక్కడెక్కడో వెతకాలని తపనతో తమకంతో
నీపై పైకి దాడి చేస్తూనే ఉన్నా...నీవు ఏం తక్కువ తిన్నావా
ఎదురు దాడి చేస్తూ ఏదపరువాలను అడ్డుగా పెట్టీ
నన్నోడించాలనే శతవిదాలా ప్రయత్నిస్తూనే ఉన్నావు

ఇలా మన మద్యి జరిగే అంతర్ యుద్దం లో 
ఇద్దరం గెలుస్తూనే వున్నాం ఆగేలుపును ఆస్వాదిస్తుంటే 
మన్మధుడు మతిపోయి మనిద్దరి యుద్దాన్నే తిలకిస్తున్నాడు
మనిద్దరిలో ఎవరు గెలుస్తారని కాదు  ఆయుద్దం రసపట్టులో ఉంది
ఏంత పోరాడతారా అనిఅయినా నిమిషాలు గంటలైనా
మన అంతర్ యుద్దం  అంతిమ దసకు చేరలేదు 
ఎందుకో కాస్త సేదతీరుదాం  అన్న మన శరీరం కోరికమేరకు

ఈ భూదిగంతాలను మరిచి.. అస్తమించిన సూర్యుడి మాదిరిగా..
నిస్సత్తువగా... సముద్రం అంచున, నాలో రగిలిన వేడిని ఆర్పుకుంటున్నాం ఇద్దరం నీఊరుకుంటావా మళ్ళీ చిలిపిగా నా ఎదవీణను కదిలించావు మళ్ళీ వేడి రాజుకొంది దాడికి సిద్దం అయ్యాను
నీవు తక్కువ తిన్నావా ప్రియా.. రమ్మని సైగచేసి
ఏం తెలియనట్టు సిగ్గుల మొగ్గై నాకు అన్నివిదాలా సహకరిస్తుంటే
నేనాగ గలనా  నన్ను ఊరక ఉండానిస్తావా 

మనమద్యి జాబిలమ్మ చల్లని వెలుతుర్లో మొదలైన యుద్దం
అలసిన సొలసి కళ్ళూ తెరచి చూస్తే ..బళ్ళున తెల్లారింది
నీపై నేను  రాత్రంతా కష్టపడి100 ఎకరాల పొలం దున్నిన రైతులా
నీరసంగా పడిఉన్న నన్ను చూసి ఉదయకాలపు సూరీడు సిగ్గుపడ్డాడు

నా కన్నీటి భాషకు అర్దం తెలుకునే పరిస్థితుల్లో నీవున్నావా


‎''..దుఖానికి అతీతమైనది కన్నీటి భాష "
అది అనుకోకుండా వచ్చేది 
గుండెల్లో గూడు కట్టుకున్న విషాదానికి ప్రతి రూపం దుఖమే
 మన పరిచయపు సందడి చేసి ... 
హృదయాల మీద చెరిగిపోని ముద్రను వేసే ఆ సన్నివేశమే .. 
ఆ మధురమైన జ్ఞాపకమే ...దుఖం కాలం ఎప్పుడూ .. 
ఏదో రీతిన కాటేయాలని.. 
నా మనస్సును  నిర్వీర్యం చేయాలని చూస్తూనే ఉంటుంది ... 
కన్నీళ్లను ఎవరైతే ఆస్వాదిస్తారో.. 
దుఃఖాన్ని ఎవరైతే భరిస్తారో వాళ్ళే మనుషులుగా ... 
మమతానురాగాల వ్యక్తులుగా సమాజాన్ని 
ప్రభావితం చేస్తూనే ఉంటారు.. 
ప్రతి నీటి చుక్కలో ఓ హృదయం దాగి ఉంటుంది 
ప్రతి కనుపాప వెనుక మనల్ని వెంబడించే ..
ప్రేమించే మనుషులుంటారు .. 
అందుకే మనం మనసారా .. 
తనివి తీరా ఏడవాలి కన్నీళ్ళతో సాహచర్యం చేయాలి .."
నిన్ను చేరుకోలేను అని అనుకున్నప్పుడు
నాకిక మిగిలిన ఒకే ఒక అవకాశం అదేకదా
ఇదేదో నామీద జాలికలగాలని కాదు
నామీద నాకు జాలి .. ఏం చేయలేని నిస్సహ్హాయస్తితిలో
నన్ను నేణు పూర్తిగా కోల్పోయి మనసునుంచి వస్తున్న వేదనే ఇది
నీవు మారావు అప్పటి నీవు కాదు ...అప్ప్టి నీవు నానువ్వు
ఇప్పటినీవు నీవు కాదు అందుకే అప్పాటి నీకోసం ఏడుస్తున్నా   
తిరిగొస్తావని ఆశాలేదు ..
ఏంమీచేయలేని నేను ఇంతకంటే ఏం చేయగలను చెప్పు

ఎప్పటికైనా నా బ్లాగ్ చూస్తావని వచ్చా ఈ రోజు నీకోసమే ప్రియా

నన్ను చూసి నవ్వుకుంటూపోతున్న నల్లని మేఘాలు 
నా  నా బుజాన ఉన్న సంచిలో చూడాలని 
పైనుంచి ఆత్రంగా చూస్తున్న పక్షులు 
మాటల మూటల్ని జాగ్రత్తగా బుజానికెత్తుకొని 
వడి వడిగా అడుగులేస్తున్నా మొత్తానికి 
ఎప్పటికైనా నాబ్లాగ్ చూస్తావని వచ్చా ఈ రోజు నీకోసమే
 ఓ మూల కూర్చొని నీకోసం చూస్తున్నా 
ఊసులన్నీ పోగేసి వుంచు. ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను. 
అని అన్నావు కదా అందుకే నీకోసం ఎదురు చూపులు ఇక్కడ 
ఎందుకున్నానో తెల్సా.. నీకు కవితలంటే ఇష్టం కదా.. 
ఎప్పటికైనా ఇక్కడికొస్తావనే ఆశతో చూస్తున్నా.. 
అదికో నడుచుకుంటూ వస్తున్నది నీవేనా.. ? 
ఏంటి కళ్ళు మసకబారాయి.. ప్రియా నీవేంటీ నీటిలో నడుస్తున్నావు. 
ఆ వస్తున్నది నీవేనా.. ఇప్పటిదాకా స్పష్టంగా చూసిన నేను 
ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు ఎందుకో.. 
నీవు వస్తున్నా వన్న ఆనందంలో 
నాకళ్ళు ఆవేశాన్ని ఆపుకోలేక కన్నీళ్ళతో నిండి ఎవ్వరు వస్తున్నది కనిపించడంలేదు .. 
అదేంటి ఆగకుండా వెలుతున్నావు అది నీవుకాదా..
ఏంటో నా కన్నీటి పొర నీవెవరో చూడనీకుండా చేస్తోంది.. 
అరె..వెళ్ళీపోతున్నావా.. వచ్చిందినీవుకాదా....?

ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చెయ్యోదిలేస్తావో స్నేహమా చెలగాటమా

ఎందుకు చెంతకి వస్తావో  ఎందుకు చెయ్యోదిలేస్తావో  స్నేహమా చెలగాటమా 
ఎప్పుడు నీ ముడివేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా 
శపించే దైవమా దహించే దీపమా ఇదే నీ రూపమా ప్రేమా 
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమా 

ఈ  కలతా    కాలే  మమతా 
మరపు రాని స్మ్రుతులలోనే రగిలి పోతావా 
మరలిరాని గతముగానే మిగిలి పోతావా 
రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు ఊరుకో ఓ హృదయమా 
నిజం నిష్టూరమా తెలిస్తే కష్టమా కన్నీటికి చెప్పవే ప్రేమా (ఫలిస్తే) 

వెంటరమ్మంటూ తీసుకెలతావు  నమ్మివస్తే నట్టడివిలో విడిచిపోతావు 
జంటకమ్మంటూ ఆశ పెడతావు కలిపిఉంచే చెలిమితుంచే కలహమౌతావు 
చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా మమకారమా 
చూపుల్లో శూన్యమా  గుండెల్లో గాయమా మరీ వేధించకే  ప్రేమా (ఎందుకు)


నాలోనుంచి నేను దూరం అవుతాను ..నీకు నేను దగ్గర కాలేనప్పుడు

నాకు నేనే మౌనం వహిస్తాను
నా పలుకులు నిన్ను  భాధించినప్పుడు...
నాకు నేనే శిక్ష విధించుకుంటాను
నాకు నేనే దూరమైపోతాను
ఎవరికీ పనికిరానప్పుడు...
నాలోనుంచి నేను దూరం అవుతాను
నీకు నేను దగ్గర  కాలేనప్పుడు
నాకై నేను వేసుకున్న శిక్ష నా మౌనం
ఆ మౌనంలో కాలి కరిగిపోతున్నా
ఎప్పటికీ తిరిగి రాని వసంతంలా
నీవు వెళ్ళీన క్షనం నుంచి ఇలా
నాలో నేణు నాకు నేను మదన పడుతున్నా ప్రియా

ఈ క్షనం ఇలాగే ఆగిపోనీ ప్రియా


ఇప్పుడు ఎవ్వరు ఎవ్వరి ఏమికానివారిలా బద్ద శత్రువుల్లా.

మది కలవర పడుతోందీ.. 
మనస్సు ఆరాటపడుతోంది
నీ జ్ఞాపకాలు ఉలిక్కి పాటు కలతనిద్రని చెరిపేస్తున్నాయి 
నేనిక్కడ అంటూ పలకరిస్తావు మదిలో గుబులు రేపుతావు.. 
మనసా అని పిలిచే లోపు... కన్నీరు మిగిల్చి కనిపించకుడా పోతావు.. 
నేనెలా ఉన్నాను ..అంటూ ఒక్కసారి పలకరించలేవా 
అన్ని మాటలు ఊసులన్ని గాలిలో కల్సిపోయాయా 
ఒకప్పుడు నీవు నన్ను తలచుకున్నా నిన్ను నేను తలచుకున్నా 
గంతులేసే మనస్సు ఇప్పుడు ఎవ్వరు ఎవ్వరి ఏమికానివారిలా
 బద్ద శత్రువుల్లా. గాయం గతుకుల్లో ఉబికి వస్తున్న రక్త్తంలా బాదలో..బారంగా జీవిస్తున్నా మనసా 

Sunday, April 28, 2013

నా పిచ్చిమనస్సు

మనిద్దరి మద్యామాటలు
మంచు బిందువులై చేజారిపోయాఎప్పుడో
ఎదను బీడుగా మార్చి ఏమార్చావు అయినా
ప్రియా నీ కోసం వెతకడం 

మానదుగా నా పిచ్చిమనస్సు  " ప్రియా"

ఎందుకో ఎప్పుడూ ఇలా నాలో నేను నలిగిపోతూ ఉంటా ప్రియా


ఎప్పుడైనా ఎక్కడైనా
వెలుగురేఖలు ప్రసరించినప్పుడు
చీకట్లో ఉన్న నేను
నా మనసుపొరల్ని విప్పుకుంటాను

ఎప్పుడైనా ఎక్కడైనా
ప్రవహించే కాంతులు ఎదురైనప్పుడు
మనస్సనే దేహాన్ని కడుక్కుంటాను ప్రియా

 
మనసుకు తాకిన గాయాన్ని
మనుపుకోవడానికి ప్రయత్నిస్తూంటే
మానిన గాయం..పచ్చిపుండుగా మారి
మచ్చగా మిగిలిపోయి నన్ను వెక్కిరిస్తుంది ప్రియా


నా కళ్ళు ప్రేమాక్షరాలని 
అచ్చు వేస్తూ ఉంటాయి
ఎదురు చూపులే
ఉచ్చ్వాస నిశ్వాసాలుగా
నీ ముందు ఎదను పరిచిన
నీ నేను నీకు గుర్తున్నానా మనసా
ఆ మెరుపులు ఎప్పటి కైనా చూడగలనో లేదో
ప్రియా

అద్బుతమైన స్వచ్చమైన స్నేహం ఎక్కడ దొరుకుతుందొ కాస్త చెప్పారా ప్లీజ్

స్నేహం అంటే ఓ విడదీయని బందం స్నేహం అంటే మనసులో గాయానికి మందు స్నేహం అంటే ఆవేదనలో ఓదార్పు స్నేహం అంటే ఆశలో శ్వాస స్నేహం అంటే నిట్టూర్పులో ఓర్పు స్నేహం అంటే మనస్సులో తియ్యటి అనుబూతి స్నేహం అంటే భాదలో వచ్చే కన్నీటికి ఓదార్పు,. స్నేహం అంటే వసంతంలో చిరుజల్లు స్నేహం అంటే మదిలో రేగే భావాలకు ఓ రాగం స్నేహం అంటే మనస్సుకు ఉల్లాసం స్నేహం అంటే నీకేంజరిగినా నేనున్నా అంటు ఓదైర్యిం స్నేహం అంటే ఓ దీమా..కదా ఈ స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇలాంటి స్వచ్చమైన స్నహం ఉందా.. స్నేహం అంటారు.. ఎవరి కోసమో ఆస్నేహాన్ని భాదపెడటారు అప్పటిదాకా గుర్తుకు రాని తప్పులు ఎంచుతారు పరిదులు అంటూ మాట్లాడుతారు. పరిచయం అయినప్పుడు లేనిపరిదులు ఇప్పుడెలా వాస్తాయి ప్రేమకు స్నేహాని కి కూడా వయస్సు ఉంటుందా.. ఇష్టం లేదని చెవ్పకుండా చెప్పుకునే కారనాలు ..? నాలుకకే నరం లేదనుకుంటాం.. కోందరి మనస్సులకు నరముండదు వాళ్ళుఎలాగైనా మాట్లాడుతారు ఇష్టం ఉన్నప్పూ ఒకలా ఇష్టం లేనప్పుడు ఒకలా తన కిష్టమైన స్నేహితుడు భాదపడినా వాళ్ళకు చీమకుట్టినట్టు ఉండదు ఇంత అద్బుతమైన స్వచ్చమైన స్నేహం ఎక్కడ దొరుకుతుందొ కాస్త చెప్పారా ప్లీజ్

చిటపట చినుకులు పడుతూ

చిటపట చినుకులు పడుతూ

చిటపట చినుకులు పడుతూ 
జివ్వుమని వచ్చే చల్లని చిరుగాలులకు
గజ గజా వనుకుతున్న ఆ చిట్టి చిట్టి కోళ్ళను
తన గొడుగుక్రిందకు రమ్మని పిలుస్తూ
చల్లటి వర్షపు తుంపరల్లో
చిలిపిగా నవ్వుతున్న నీవు
నీవ్ రమ్మ్నగానే రెక్కలు విప్పుకొని
ఆనందంగా నీగొడుగు క్రిందకు వస్తున్న
చిట్టీ చిట్టీ చిన్నారి పక్షులు
దృస్యం ఎంద అద్బుతంగా ఉందో
మనసు పులకరించేలా..

ఆపుకరింతల్లొ నీమాటలు ఎంతబాగ అర్దం చెసుకున్నయో
అచిట్టీ చిట్టి కోడి పెట్టలు..వర్షపు జల్లుల్లో తడిచే అనందంకన్నా
నీపిలుపులో ఆప్యాయతకు అవి ఉబ్బి తబ్బు 

అయ్యాయని చెప్పకనే చేప్పోచ్చేమో కదా

అందరూ వున్నా.. ఏదో .. ఒంటరి ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా..

నేను ఎందుకు ఇంతలా నిన్ను ప్రేమిస్తున్నానో...
మాటల్లో చెప్పలేను... నీకు చూపించనూ లేను...

నీవు చిందించిన చిరునవ్వులు, నీవు చూపించిన ఆప్యాయత, అనురాగం..
ఇంకా నన్ను వీడలేదు, అవి నేను మరువనూ లేదు.

మనం కలిసినప్పుడు... ఒక స్నేహబంధం..
భావాలు పంచుకున్నప్పుడు... ఒక ఆత్మీయబంధం.
కలసి బ్రతకాలి అనుకున్నప్పుడు... ఒక అనురాగబంధం.


కానీ, నేనే.. నీవు నాపై వుంచిన నమ్మకాన్ని, ఆసరాగా చేసుకుని,
ఆ బంధాలని, నిన్ను దూరం చేసుకున్నాను, దూరంగా అంటే ... ఎల్లప్పటికీ...
నీవు దూరం అయ్యావు కానీ.. నీ తలపులు ఏ క్షణమూ నన్ను వీడలేదు..

ఒంటరిగా తిరుగుతున్నా అప్పుడపుడూ.. తెలియకుండానే! నిను పిలుస్తూ...వుంటే..
నీ సమాధానం రాక.. ఓ కన్నీటి చుక్క రాలి.. నన్ను ఓదారుస్తుంది...

అందరూ వున్నా.. ఏదో .. ఒంటరి ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా..
అన్నీ వున్నా .. ఏదీ లేనట్టుగా.. అంతా శూన్యంలో జీవిస్తున్నాను...

అప్పుడప్పుడూ అనిపిస్తూ వుంటుంది.. నీవు లేని...నీ ప్రేమ లేని
ఇలాంటి నా ఈ జీవితం జీవించే కన్నా......... చనిపొతే బాగుంటుందేమో! అని,

నీ ముందు, అర్ధిస్థున్నా!!
చెప్పు నేను ఏమి చెయ్యలి.....????
ఆ రోజులు తిరిగి రావటానికి! తిరిగి నీ ప్రేమ గెలవడానికి.

గుప్పెడు జ్ఞాపకాలను వెంటేసుకొని అవే నిజాలని బ్రమపడ్డానేమో

గుప్పెడు జ్ఞాపకాలను వెంటేసుకొని
అవే నిజాలని బ్రమపడ్డానేమో మనసా
నిజాన్ని తెల్సుకోలేక..అబద్దాన్ని నమ్మలేక..
జరుగుతున్న వాస్తవన్ని వంట బట్టించుకోలేక
గుండేలో నుంచి వస్తున్న దుక్కాని ఆపుకోలేక..

పొర్లివస్తున్న దుక్కాన్ని తట్టుకోలేక
నీవు నన్ను ఓడించావన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేక
నాలో నేను మిగిలిఉన్నానో తెల్సుకోలేక
నాకు నేనుగా నీదగ్గపోగొట్టూకున్న జీవితాన్ని 

తెచ్చుకోలేక చావలేక బ్రతకలేక గుప్పెడు మనసును చంపుకోలేక
గుండేల పై ప్రతిక్షనం దాడిచేస్తున్న నీ గుప్పెడు జ్ఞాపకాల దాడికి
నేను ప్రతిక్షనం చస్తు బ్రతుకుతున్నాప్రియా అంతకంటే ఏం చేయగలను చెప్పు

కాగితపు చెట్టు..ఓ అందమైన పేపరైంది ఆతరువాతేమైంది ( ఆత్మకధ )

నేనో కాగితపు చెట్టును
ఈచిట్టడవిలో జీవితం చిరాకేస్తుంది అనుకుంటుండగానే
ఎవరొ నన్ను బలవంతంగా తీసుకెలుతున్నారు...
మాట్లాడలేని జీవిని ఏం చేయలేక అలా ఉండిపోయా

పొనీలే ఇలా అన్నా ఇక్కడ నుంచి వెలుతున్నా అన్న ఆనందం
అక్కడ పెద్ద పెద్ద మిషన్లలో నన్ను ఏమేమో చేశారు
చెట్టులా ఉన్న నన్ను తెల్లని కాగితం చేశారు

అందమైన పుస్తకంలో ఒదిగిపోయి
నన్ను నేను చూసుకుంటే నాకే ఎంత గర్వంగా ఉంది
మనిషి తెలివిలి చాలా సంతోషం వేసింది
ఎక్కడో అడవిలొ ఉన్న నన్ను ఇలా అందంగా చేసినందుకు

ఎవరో అందమైన అబ్బాయి చేతిలోకి వెళ్ళా
"చీ" దీనమ్మ జీవితం అమ్మాయి నన్నెందుకు కొనుక్కోలేదని ఫీల్ అయ్యా
పోనీలే దెవుడిలా రాసిపెట్టాడని మనస్సుకు సర్ది చెప్పుకున్నా
కదా జీవితంలో మలుపులంటే ఇవేనేమో

ఈ అబ్బాయి నన్ను దురంగా రాక్ లో పెట్టాడు
ఏంటో ఎప్పుడూ దిగాలుగా ఉంటాడు
నామీద ఏం రాస్తాడాని ఆత్రంగా ఎదురు చూస్తున్నా
అరోజు రానే వచ్చింది ఓరోజు హడావిడిగా వచ్చాడు
నన్ను తీసుకొని రాయడం మొదలు పెట్టాడు
రాస్తున్నప్పుడే నామీద అతని కన్నీటి చుక్కలు రాలాయి

మొత్తానికి మనస్సు భారంగా రాస్తున్నాడు
ఈ రాతల వళ్ళైనా తన గుండెభారం దిగుతుందిలే అన్న ఆలోచన
ఏదో అందమైన కవిత రాశాడు
నన్ను తన సంచిలో బద్రంగా తీసుకెలుతున్నాడు
ఓ పార్కులో అందమైన అమ్మాయి
కి నన్ను ఇచ్చాడు ఏంత ఆనందమో 

మొత్తానికి అమ్మాయి చేతిలోకేళ్ళా
అప్యాయంగా నన్ను తీసుకోని
నాపై అందంగా రాసిన రాతలు చూసి మురిసిపోయింది
వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుతుంటే
నాకు చాలా హేపీ అనిపించింది
అలా అమ్మాయి ఇంటికి చేరా
ఆ అమ్మాయి చాలా అందంగా ఇంటీని
తనలాగే అందంగా ఉంచుకొంది
ఇంటిని నన్ను తీసుకొచ్చిన కాన్నుంచి
నాపై రాసిన అక్షరాలను ఎన్ని సార్లు చదువుకొందో 

అలా నెలలు నన్నెంతా ఆప్యాయంగా చూసుకొందో
ఏమైందో ఏమో నాలాంటి లెటర్ కూత్తది తెచ్చిది
నన్ను చదవడం మానేసింది ఆలెటర్ తోనే
ఎక్కవ సమయం అంతకుముందు నన్నెంత
ఆప్యాయంగా చూసుకొందో ఇప్పుడా కొత్త లెటర్
చదువుతోంది నన్నసలు పట్టించుకోవడం లేదు 

ఎందుకో ఓరోజు .. ఎక్కడొ పుస్తకంలో బద్రంగా ఉన్న నన్ను
తీసుకోని నలిపి చెత్తకుప్పలో పడేసింది
చీ ఎంత కంపో ..అయినా ఎందుకిలా చేసిందో తెలీదు
అప్పుడు మళ్ళీ మనిషి నమసును తిట్టూకున్నా
ఏదీ శాశ్వితంకాదు చివరికి ప్రేమకూడా 

ఒకరోజు వరకు నామిద ఉన్న అక్షరాలను
చెడిపోకుండా ఊండలా చుట్టుకొని కాపాడా
మాళ్ళీ ఆ అమ్మాయి వచ్చి నన్ను  తిసుకుంటుందేమో అని
రాలే కాని ఓ రోజు బోరున వర్షం నామీద ఉన్న అక్షరాలన్ని కొట్టూక పోయాని
నేనూ కొట్టుక పోతున్నా ఏతో తెలీదు ఏక్కడీకో తెలీదు 

ఎందుకో నాపై అందంగా కన్నీటితో కావ్యం రాసిన అబ్బాయి
గుర్తుకొచ్చాడు ఏంచేస్తున్నాడో ఎంతలా ఏడుస్తున్నాడో అని
అయినా నేనేం చేయగలను ఓ చెత్తగాకితంగా మారిపోయా ఇప్పుడు


నీకసలు స్నేహం విలువ తెలుసా

స్నేహాన్ని 
పువ్వుతో పోల్చకు
వాడిపోతుంది
ఆకుతో పోల్చకు రాలిపోతుంది
మంచుతో పోల్చకు కరిగి పోతుంది
నీ చిరునవ్వుతో పోల్చు
శాశ్వతంగా నిలిచివుంటుంది.
గొంతులో ప్రాణం ఉన్నంత వరకు

అయినా నాస్నేహం విలువ తెలిస్తే
నీవిలా ఎందుకు చేస్తావు నా పిచ్చిగాని  

స్నేహం బాగుండాలని ప్రాణం ఇచ్చేవాళ్ళను చూసాను
ప్రతిక్షనం నరకం చూపిస్తూ అవమానించే నిన్ను చూస్తుంటే
ఏమనాలో ..అర్దంకావడంలేదు...అంతలా మారావెందుకో
ఒకప్పుడూ నీస్నేహంలో తడచి ముద్దవ్వాలని ఎదురు చూసాను
ఇప్పుడు నాకు చేసిన అవమానానికి చేస్తున్న అవమానానికి
చస్తూ బ్రతుకుతున్నా నిన్నేమనాలో తెలీక ఇదా స్నేహం అంటే ప్రియా

నాలో నేను తన్నుక చస్తున్నా నీకోసం

నీకూ నాకూ  మధ్య
లెక్కే లేని అడుగుల దూరం
తడబడుతున్న నా అడుగుల సాక్షిగా
నాలో నేను తన్నుక చస్తున్నా నీకోసం
కనిపించవని తెల్సి వెతుకులాట మొదలు పెట్టాను

అయినా సరే...
కనుపాపల ముందు, రెప్పల వెనుక
నీ రూపం ప్రతినిమిషం.
కదిలాడుతుండగా
నీవు ఎదురుగా ఉండాలా
నీ రూపంచాలు నాహృదిలో నీతో మాట్లాడేందుకు ప్రియా


మాటలు మంచు బిందువులై చేజారిపోయాఎప్పుడో
ఎదను బీడుగా మార్చి ఏమార్చావు అయినా
నీకోసం వెతకడం మానదుగా నా పిచ్చిమనస్సు ప్రియా

Saturday, April 27, 2013

గుండె పగిలిపోయేలా అవమానించు ప్లీజ్ ప్రియా

నాలోకి నువ్వు
నీలోకి నేను ఆవహించి
ఈ రాత్రి
మనకు బదులుగా
మన మన మనస్సులు కల్సిన వేళ
అలా వెళ్ళిన చీకటి రాత్రి

చీకటిని కాల్చిన
ఆ కాటి కాపరుల్లా  జాబిల్లి కాంతిలో
మనసనే శవాన్ని కాలుస్తున్నా

ఇలా కాలేలాలేదు
నీకు తెల్సుగా అది కాలాలంటే
గుండెలు మండేట్టు అవమానించు
ఎవరిదగ్గరో.. గుండెలు పగిలేట్టు

అవమానించడం నీకు అలవాటేగా
ఆగాయం చాలడంలేదు 
ఇంకా ఇంకా ఒకేఒక్క దెబ్బకు
గుండె పగిలిపోయేలా అవమానించు ప్లీజ్ ప్రియా

ఎవరు నీవు.....నాకు ఏమవుతావు.....?


ఎవరు నీవు.....
నాకు ఏమవుతావు.....
నన్నెందుకు ఇలా....వేధిస్తావు
నీవు కలవైతే
నేను నిదురిస్తాను...
మధురమైన జ్ఞాపకమైతే
నా మస్తిష్కంలో ఏదో పొరలో.....
నిన్ను పదిలంగా.....నిక్షిప్తపరుస్తాను.
గాయం రేపె బాధవైతే
మౌనంగా.....భరిస్తాను.
కానీ....,
నీవు మాటలు రాని మౌనంలా...
వెలుగు లేని చీకటిలా...
గులాబీ చాటు ముల్లులా......
అనుక్షణం నన్ను వెంటాడే నీడలా...
ఎందుకు నన్ను ఇలా.......వేధిస్తావు...

ఒక్కోసారి నీ మాటలతో నన్ను  నామనస్సును
పెద్ద పెద్ద గాయాలు అయ్యేలా చేశావు
నీకది ఆనందమా.. ఎందుకలా మారావు
అప్పుడు అలా లేవే.. ఇంతలో ఇంత మార్పా
కొందరి పరిచయంలో నేను ఇప్పుడు వేష్టుగా
వాళ్ళతో పోల్చి నన్ను అవమానిస్తున్న నిన్నే
చూస్తున్నా ఎమనాలో తెలీక
అభిమానించినందుకు అవమానించాలా

వాడు హేపీగా ఉండాలంటే నన్ను వేదించాలా ప్రియా
ఎందుకలా నేనూ మనిషినే కదా
ఒకప్పుడు నేనెక్కడ భాదపడతానో అని ఫీల్ అయ్యావు
ఇప్పుడు ఏదో విదంగా భాదపెడుతున్నావు...నీవు చాలా గ్రేట్
నీకు ఏదైనా సాద్యి అని నిరూపిస్తున్నావు ప్రియా

అందరిలో నిన్ను మంచిగా చెప్పుకోవాలంటే నన్ను దోషిని చేయాలేమో ప్రియా

పాత ఐడీ "డీ యాక్టివేట్" చేసి
కొత్త ఐడిలో నన్ను బ్లాక్ చేసి
అందరిలో నన్ను దోషిని చేసిమాట్లాడుతున్నావు
ఆనోట ఈ నోట అందరు అడుగుతున్నారు
ఇంతలా  నమ్మిన నీకు ఏమిచ్చి రుణం 

తీర్పుకోగలను చెప్పు
అందరిలో నిన్ను మంచిగా చెప్పుకోవాలంటే 
నన్ను దోషిని చేయాలేమో
 

ఆశపడటంలో తప్పు లేదు ....ఆశ నిజం అవ్వాలనుకోవడమే నా పిచ్చి కదా..?


ఇన్నిన్ని అక్షరాలతో నిన్ను కీర్తిస్తున్నా...
ఇన్నిన్ని పదాలతో నిన్ను పూజిస్తున్నా...
ఇన్నిన్ని కవితలతో నా మనోబావలను తెలుపుతున్న..
ఇన్ని చేసిన నాకు, నీవేమి చేయగలవు...?
ఒక్క పదమై పలుకలేవా భావనలుపెదవిపైన...
ఒక్క క్షణమైనా చూడలేవా కలమపైన...
ఒక్క గడిఅయినా ఒప్పుకోలేవా నాది ఉహ కాదు నిజమని...
ఒక్క మాటైన చెప్ప్పలేవా నా ఉహకి మొదట ప్రాణం పోసింది నువ్వేనని...
ఇంతకన్నా నిన్నేమి అడగను...
ఇంతకు మించి నిదగ్గర ఏమి ఆశించాను...
నేను కోరేది ఒక్కటే...
ఈ అలజడి..
నాది కల్పనన కాదని, నీవు కలిస్తే అన్నీ నిజాలేనని
నిజం నీవు ఒప్పుకోవాలని...
నా ఆలోచన తప్పుకాదని చిన్న ఆశ...
ఆశపడటంలో తప్పు లేదు ....ఆశ నిజం అవ్వాలనుకోవడమే నా పిచ్చి కదా..?

Friday, April 26, 2013

నీకోసం నాతో నేను యుద్ధం చేసేదీ ....గాయపడేదీ నేనే... ప్రియా

నీ తలపులు కలలోను కలవరపెడుతుంటే...
నిద్రలేని రాత్రుల్ల  సాక్షిగా నీకోసం  నా ఆవేదన
నన్ను నేను ఓదార్చుకోలేక నాలో నేను
లోలోపలే నా పై కలబడుతున్న
నీ జ్ఞాపకాలను తడుముతూ నాకన్నీటికి
సమాదంనం ఎమని చెబుతావు ప్రియా

నీ తలుపులు రేపే
నా ఈ నిశ్శబ్ధయుద్దంలో..
ఒంటరిగా పోరాడుతున్నా నా  మనస్సుతో
యుద్ధం చేసేదీ నేనే....
గాయపడేదీ నేనే... ప్రియా
నాకూ గాయపడాలని లేదు
ఎప్పుడూ విజయం సాదించాలని ఉంది కాని అది
సాద్యిం కాదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ప్రియా
నీవిషయంలో ఎప్పుడూ ఓటమిని గుండెలపై వేసుకొని
నీకోసం భారంగా తిరుగుతున్నా ప్రియా

అమ్మాయి,,,అమ్మాయి అని ఆరాట పడిపోతున్నాడు


ఏనాడు నీ నీవు పరిచయం అయ్యావో ఆ రోజే నేను మృత్యువుకౌగిళ్ళోకి వెలుతున్నా అని తెల్సుకోలేక పోయా ప్రియా

నేడు మరణం నన్ను వెంటాడుతోంది..
మరో జన్మకు సమయం ఆసన్నమైంది

ఏనాడు నీ నీవు పరిచయం అయ్యావో
ఆరోజే నేను మృత్యువు కౌగిళ్ళోకి  వెలుతున్నా 

అని తెల్సుకోలేక పోయా ప్రియా
చావలేక బ్రతుకుతున్న నాకు చంపటానికే పుట్టావేమో
ప్రేమ ఒలకబోసి అన్నీ  అచ్చం నిజంలా నమ్మించేందుకు 
నీ పరిచయం అయినప్పుడే
ఆనాడే నా పుట్టుక ఆగింది.
కేవలం నీ సంగమం కోసమే
జీవించడం మొదలెట్టా....!!!
నీ జన్మ నా కొరకై ఉండి ఉంటె ...
నా జన్మకు మోక్షం ఉండేదేమో..
.
ప్రతి కలయిక
విడుకోలుకు నాంది అంటూ... విడలేను.
మరో జన్మలో కలుస్తామని..నమ్మలేను.
మరి ఏం చేయను
నీ చెంత ఉండాలనే
నా చింత తీరాలంటే ?
పేగు పాశాలు ప్రశ్నించడం
రక్త బంధాలు తెంచుకోవడం
లేని దానినై
ఉన్నట్టుండి
వానలో నుండి
జారిపడే నత్తగుల్లల్లా..
ఏ మూలాలు లేకుండా..
జన్మించి ఉంటె ఎంత బాగుండేది 

నిన్నటి కన్నా నేడు
నేటి కన్నా రేపు
బావుంటుందనే ఆశతో
రోజు జన్మించా !
అలా అకారణంగా
కొన్ని వేల జన్మలు వృథాగా !!
నన్ను నేను కనే..
నా  వేదన చూడలేక దరిచేర్చుకున్నావో..
ఒంటరిగా వదిలి వెళ్ళలేక నా దగ్గర ఉన్నవో...

ఏమౌతుందో అర్దంకాక పిచ్చెక్కుతోంది ప్రియా 

స్నేహం మృత్యువుగా మారితే...మనిషి ఎలా బ్రతుకుతాడు


కనిపించకుండా వెల్లిన నీకు నా కన్నీళ్ళ సాక్షిగా


కలలు మాత్రం నాకు మిగిల్చి నా కళ్ళకు కనీళ్ళు మిగిల్చి నమాయ కళ్ళు

అలవోకగా నవ్వే కళ్ళు
ఎలా ఉన్నావంటూ  ప్రశ్నించే కళ్ళు
ముద్దొచ్చే ముచ్చటైన కళ్ళు
ఆశ్చర్యంగా నేనున్నా అంటూ 

నన్ను పలకరించి మది పులకరించేలా చేసి
ఏమీ ఎరగనట్టు రెప్ప దించిన కళ్ళు
నలుగురిలో నన్నే వెదికే కళ్ళు
రా రమ్మని కైపెక్కించే కళ్ళు
సిగ్గుతో అరమోడ్పిన కళ్ళు
ఇవన్నీ నామీదకు వొదిలి ఏమీ
ఎరగనట్టు విచిత్రంగా..చిత్రం చేసిన
కళ్ళు
కళ్ళు కలలు మాత్రం నాకు మిగిల్చిన 
నా కళ్ళకు మాత్రం కనీళ్ళు మిగిల్చి కళ్ళు
సొగసరీ నీవు నిజంగా గడసరివని కళ్ళు
అవి నన్నెందుకో మోసం చేశాయి
అన్నీ నిజం అనేలా చేసి మాయం అయ్యాయి మాయ కళ్ళు


నిజంలా బ్రమింఛి బళ్ళున పగిలి నా గుండేల్లో జ్ఞాపకాలై గుచ్చుకున్నాయి

నిజం చెప్పు ప్రియా
నేను నీకేమవుతానని!!
నాకు తెలుసు నీకు తెలియక పోయినా
నీకేం కానని నీవు చెప్పినా
నీకు తెలియని నీ నీడను
నేకెప్పుడూ తోడుండే మది గీతాన్ని
నీ మనస్సు ఎప్పుడు కలుక్కు మన్నా
ఎప్పుడో గుర్తొచ్చే కాలం ఇచ్చిన
నీ మదిని మరిపించిన గుర్తుని
నేను నాకూ నీకూ తెలియని ఒక మాయని
మరపురాని మరువలేని ఓ గాయాన్నంతే ప్రియా


నిరుడు నీవెక్కడ.... నేనెక్కడ.....
కలలో అయీనా అనుకోలేదే ఎదురొస్తావని
విధి కాలంతో కలిసి ఒక్కటై మునుపెన్నడూ
ఎరుగని సంతోషాన్నీ భాధనీ నవ్వులనీ
ముప్పేటగా చేసి నన్ను ఊపిరాడనివ్వక
అనుక్షణం నీగూర్చి నా మదిని మెలిపెడుతూ
నిద్రని దూరం చేసి కళ్ళని కలవరపెడుతున్నది
నిజానికి ... అబద్ధానికి మధ్య ఉన్నది గోడలాంటి కల  

నిజంలా బ్రమింఛి బళ్ళున పగిలి
నా గుండేల్లో జ్ఞాపకాలై గుచ్చుకున్నాయి

తట్టుకోలేక ఇక తేరుకోలేక
విధికి తలవంచి...విగత జీవున్నైయ్యానీరోజు ప్రియా

Thursday, April 25, 2013

మాటపోటుకు మనస్సు చచ్చిపోతుంది

కత్తిగాటుకు శరీరం గాయపడుతుంది....
మాటపోటుకు మనస్సు చచ్చిపోతుంది
కత్తికంటే పదునైన గాయం అవుతుంది
కత్తిపోటును మందులతో మానేలా చేయోచ్చేమోగాని
మాటపోటు తగిలన మనిషి మనస్సుకు మందేలేదు
అది చచ్చిపోవాల్సిందే ఎప్పటికైనా ఆ మాట పోటుకు

నీవో నమ్మలేని నిజానివి ప్రియా

నన్నో అక్షర సముద్రంలో 
పడేసి అందులోనుంచి
మంచి ముత్యలనేరమంటావు 

నేనో మంచు ముత్యాన్నంటూ
అందినట్టే అంది చిక్కకుండా 

చేజారిపోయిన జాబిల్లిలా నన్నుడికిస్తూ
నిలవకుండా జారిపొయే పచ్చటి ఆకుపై తేలిన నీటిబొట్టులా నన్నూరిస్తూ
చేజారిపోయిన నిన్ను చేరుకోలేక 

ఉక్రోషంగా కన్నీళ్ళతో చుస్తే
చేతులనిండా బంధించలేని గాలిలా నన్ను చుట్టేసి
ఊహల్లో ఉక్కిరి బిక్కిరి చేస్తావు 

వద్దన్నా వడిలో తలదాల్చి
నన్ను ఊరడిస్తావు ఉలిక్కిపడి చూస్తే 

అంతా చిమ్మ చీకటి ప్రియా
నన్ను నమ్మించి మోసం చెసిన 
మాయావి నీవు కదా ప్రియా  నీవు

తనని మోసం చేసి వెళ్ళిపోయిన ప్రియురాలి గురించి ,తానూ చనిపోతూ ఒక ప్రియుడు రాసిన ఒక విషాద ప్రేమ లేఖ..

ప్రియా ప్రియతమా...
ఇటు చూడు,
నా వైపు చూడు,
నా కళ్ళలోకి చూడు,
నా కళ్ళలోని నీ రూపు చూడు

ప్రియా ప్రియతమా

జీవం లేని నా కళ్ళు చూడు,
నీ కాళ్ళ రెపరెపలు చూడలేని ఆ కల్లెందుకు.

ప్రియా ప్రియతమా

మూగబోయిన నా నోరు చూడు,
నిన్ను ప్రియతమా అని పిలవటానికి వీలు లేని ఆ నోరు ఎందుకు.

ప్రియా ప్రియతమా

సరిగా లేని నా గుండె చప్పుడు విను,
నీ గుండె ని తాకలేని ఆ చప్పుడుఎందుకు.

ప్రియా ప్రియతమా

ఆగిపోతున్న నా శ్వాసని తాకు,
నీ శ్వాస లో చేరలేని నా శ్వాస ఎందుకు.

ప్రియా ప్రియతమా

నేనే నీవై ప్రేమించా,
నువ్వు నేను ఒకటవుతామనుకున్న,
నన్ను వదిలి వెళ్ళిపోయావు,
నీతో కలిసి జీవించలేని ఈ ప్రాణమెందుకు,
అందుకే ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతున్నా....

ఆమె లేని తన జీవితం వ్యర్ధం అనుకున్నాడు..

అందుకే తను కూడా మరణిస్తూ ఈ చివరి ప్రేమ లేఖ రాసాడు..

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..


ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..

చరణం:
నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము..గడిపేదెలా కాలం

పగలైనా కాసేపు పని చేసుకోనీవు..
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా.. నీ రూపే తోచింది..
నువుకాక వేరేదీ కనిపించనంటోంది

ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది!

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటునే.. ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో..నను నిలవనీకుంది..

మతిపోయి నేనుంటే..నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో.

 

నేనేంటో తెలుస్తుకుంటే నీవిలా చేయవేమో

నిదుర రాని రేయిలో
పురుడు పోసుకున్న వేదనలు

నివుగప్పిన నిజంకాని నిజాలు
ఎవరు చూసారు గనుక....
జారుతున్న కన్నీటిలో
రేపటి స్వప్నాలు ఉన్నాయని
ఎవరికీ తెలుసు గనుక...
చిరునవ్వుల వెనుక
రాసుకుంటున్న మంటల వేడి
ఎవరిని తాకింది గనుక....
నేనేంటో...........తెలియడానికి.

నీవు తెల్సుకోవాలని ఒక్కక్షనం ఆలో చిస్తే
కన్నీటి కారనాలన్నిటిలో నిజాలు తెలిసేయి
నేనేంటో తెలుస్తుకుంటే నీవిలా చేయవేమో
అయినా నాగురించి అన్నీ తెల్సి చేసావా
తెల్సుకోలేక చేసావా ..
ఏముందిలే అని చేశావా ఎందుకిలా చేశావు  

నీవు నాగురించి తెల్సుకోలేకపోవడం వెనుక
కన్నీటి ధారల లు దారి తెలియని నా కన్నీటికి
కారనం తెల్సుకుంటే ఇలా చేఅవని నా గుండే చెబుతోంది

నడిరాతిరి మొదలైన కన్నీటి జల్లు

నడిరాతిరి మొదలైన కన్నీటి జల్లు
తెలవారే దాకా.... కురుస్తూనే ఉంది.
చివరిగా..రెండు కన్నీటి బొట్లు
"ఎందుకే తనకోసం తాపత్రయపడి
మమ్మల్ని చేజార్చుకొంటావు...?" అంటూ...
నేలరాలాయి....
ఎప్పటికి...జవాబు లేని ప్రశ్న
నాలాగే....!!!

నీ ప్రేమ పుస్తకంలో ఒ పేజీగా మిగిలిపోయానెందుకు ప్రియా


Wednesday, April 24, 2013

ప్రక్రుతిలో నాకు మనసున్న ప్రాణులే కనిపించడంలేదు అంతా స్వార్దం.

ఇప్పుడు నామనస్సు మనస్సులోలేదు
మనసులో ఆలోచనలు లేవు
ఉన్నదల్లా ఒకటే
ఏ నిముషంలో ప్రాణం
పోతుందో అనే ఆలోచన

ఇపుడు హృదయాలలో స్పందన లేదు
ఆర్ద్రత అనురాగం లేదు
అనుభూతి, ఆత్మీయత లేదు
ఎదురయ్యేదంతా ఒకటే....
మరణ మ్రుదంగ నాదాల సవ్వడులు...
జనారణ్యంలో మానవ మృగాల సంవేదన వినిపిస్తుంది
వెలుగులో ఉన్నా చీకటి .
చీకట్లో ఉంటే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి
ఎవరివని చెవులు రిక్కరించుకొని వింటే అవినావే వింతగాలేదు...?

ప్రక్రుతిలో నాకు మనసున్న ప్రాణులే కనిపించడంలేదు
అంతా స్వార్దం.. నిజం తెల్సుకునే ప్రయత్నం చేయరు
పలకరింపు లేదు పరామర్శ లేదు
గాలి,నీరు లేదు
మంచి, మమత లేదు.అనురాగంలేదు
గుర్తుకు వస్తున్నదంతా ఒకటే...
చనిపోయిన తరువాత నాదేహం కుళ్ళు వాసతప్ప ..

నేడు మరణం నన్ను వెంటాడుతోంది..

నేడు మరణం నన్ను వెంటాడుతోంది..
మరో జన్మకు సమయం ఆసన్నమైందని.
ప్రతి కలయిక విడుకోలుకు నాంది అంటూ...
నిన్నుఇప్పుడు విడలేను కాని తప్పదేమో .
మరో జన్మలో కలుస్తామన్న నమ్మలేను.
మరి ఏం చేయను నీ చెంత ఉండాలనే
నా చింత తీరాలంటే ఇప్పుడు  

నేను మరణించక తప్పదేమో  ప్రియా

నాకొక ప్రేమ కావాలి.ప్రేమ మాత్రమే కావాలి.

నాకొక ప్రేమ కావాలి.ప్రేమ మాత్రమే కావాలి.నేను చూడని ప్రపంచాన్ని చూపే నిజ ,నిర్మల,శాశ్వత ప్రేమ...కానీ ,ఎక్కడుందా...ప్రేమ ? ఈ రోజాకు వాసనే కాదు మనసు కూడా లేదనుకుంటున్నాయి ఆ తుమ్మెదలు.వాటికీ మకరంధమే తప్ప బాహ్య సౌందర్యము కూడా కావాలి కదా...!!
          గడ్డి పూలలో నేను ఓ గడ్డి పోచనై కలసి పోవాలి....అనుకుంటాను.కానీ ,భిన్నమైన నా భావాలూ వాటితో కలవనిస్తే కదా....! ఏ వసంతానికో....ఆశల చిరుగాలి నన్ను తాకి ,అమ్మ ప్రేమలా... నన్ను లాలించి కొమ్మకో... ఆకు చొప్పున చిగురింప చేసి , చేట్టువైన తర్వాత ఇతరులకు నీడ నివ్వడానికైనా... బ్రతుకు అన్నట్టు శాసిస్తోంది.
             భావాల బరువు తాళలేక నా పూరేకులు ఒక్కొక్కటే రాలిపోతున్నాయి.అన్నీ, రాలితేనే కదా నాకు హాయి.నాకు లేని స్వేచ్చ నా భావాలకైనా కలుగుతుంది. వసంత చిరుగాలి నువ్వు తప్ప నాకెవరున్నారు  చెప్పు నా బాధను పంచుకోవడానికి.అలా...అలా... గాలికి కొట్టుకోనిపోతూ...నా కలల ప్రేమసౌధం తాజ్ మహల్ ని చేరి ,ముంతాజ్ సమాధిపై రాలి ,వాడిపోయినా.... మరుజన్మకైనా... నేను కోరే ప్రేమ దొరుకుతుందేమో....
                     ఎన్నటికీ చిగురించని నా ఆశల్లా...మోడువారిన దేహంతో... ఆ చెట్టు మాత్రమే మిగులుతుంది నా జ్ఞాపకాల నీలి నీడలను ఈ భూమిపై పడవేస్తూ....పువ్వు లాంటి నా మనసేనాడో వాడిపోయింది.గాలితో కలసిన నా ఆత్మ నను కన్న నా దైవం వద్దకు వెళుతోంది..."నేనొక ప్రేమ పిపాసిని" అని పాడుకొంటూ .....

నా జ్ఞాపకాలన్నిటిని నిర్దాక్ష్యిన్యంగా చిదిమేస్తుంటే మాటలు రాక మౌనంగా చూస్తునే ఉన్నా ప్రియా

మనమధ్య దూరాన్ని కరిగించాక
మనమెవరో తెలియని తన్మయత్వంలోకి
మనం జారినప్పుడు
నిజంలాంటి కలలోనో కలలాంటి
నిజంలోనో కన్నీరై జారి
నీ చెక్కిల్లను తాకాలని 

తపన పడుతుంటా ప్రియా
మనసు నాతో....చెప్పే ఉసులు...
పెదవులు చాటున 

మూగగా పలికే కోటి రాగాలు....
లిపిలేని మౌన భాషలు 

ఊసులుగామారుతున్నా ఎందుకో
ప్రకృతి నుంచి పొందే వింత అనుభూతులు....
మౌనం నా చుట్టూ చేరినప్పుడు 

నా కలం రాసే మాటలు....
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో..కాలిన గాయంగా 

మిగిలిపోయానెందుకో
జ్ఞపకాలన్నిటినీ....పదిలంగా...

ండాలనే..ఉంచుకోవాలని చూస్తున్నా
వాటిని జాగ్రత్తాగా పట్టుకున్నావనుకున్నా..

ఆ తియ్యని జ్ఞాపకాలన్నిటిని
నిర్దాక్ష్యిన్యంగా చిదిమేస్తుంటే మాటలు రాక 

మౌనంగా చూస్తునే ఉన్నా ప్రియా

నాలో నేను తన్నుకు చస్తుంటా ప్రియా

మౌనంగా వుంటూ వలపెరుగని మనసుకు
మరువలేని వలపు మాటలెన్నో నేర్పుతావు
పరెగెత్తే మనస్సును కాసేపు ఆగమని
నీమాటకోసం ఎదురుచూస్తే
నీ దారిన నువు కదలిపోతూంటావు
కరిగిపోతున్న కాలంలో
నేనెక్కడున్నానో తెలుపుతూంటావు
ఏంటో ఒక్కసారి అర్దం అవుతావు
మరోసారి అర్దం కావు
అర్దంఅయి అవ్వనట్టు ఉంటావు ..
తప్పునీదో నాదో తెలీనంతగా
అందుకే నీజ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా
నాలో నేను తన్నుకు చస్తుంటా ప్రియా

Tuesday, April 23, 2013

నింగిలోని జాబిల్లి వై నాకందనని నవ్వుతుంటే,

మనసు నిండ ప్రేమనుంచుకోని కురిపించలేని మేఘంలా నీవుంటే,
నీ జ్ఞాపకాల వేడిలో బీటలుబారిని హృదయంతో ఎదురుచూస్తున్నా ప్రియా.

సంతోషాలన్ని నీలోనింపుకొని సెలయేటిలా ప్రవహిస్తున్నా,
నిలువదని తెలిసినా నా ప్రేమతో ఆనకట్ట వేసి నిన్ను ఆపాలని ఆశిస్తున్నా ప్రియా.

ప్రతిక్షణం నీ విరహం, నీ కోపం జ్ఞాపకలై నన్ను ఏడిపిస్తున్నా
ఆ జ్ఞాపకం మెదిలిన మరుక్షణం అన్ని మరచి మళ్ళీ నీ ప్రేమకోసం పరితపిస్తున్నా ప్రియా. 
నింగిలోని జాబిల్లి వై నాకందనని నవ్వుతుంటే,
నీటినై నీ ప్రతిబింబాన్ని గుండెలో దాచుకుంటూ ఆనందిస్తున్నా
ప్రియా.
అందనంత దూరంలో ఒయాసిస్సులా నీవుంటే,
గుండెనిండా ఆశలను నింపుకుంటూ బ్రతికేస్తున్నా
ప్రియా.
.
 

నీవంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..

నీ వంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప ....కన్నులకు కలలు లేవు నీరు తప్ప..
మనస్సు ఉంది మమత ఉంది ......పంచుకునే నీవు తప్ప..
ఊపిరి ఉంది ఆయువు వుంది..ఉండాలనే ఆశతప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంటేనా..ప్రేమిస్తేనే సుదీర్గనరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప...చివరికి ఎమవ్వాలి మన్ను తప్ప

నీవంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..
నడిచొస్తానన్నావు ..మళ్ళోస్తానన్నావు..జంటై మరొకరి పంటై వెళ్ళావు
కరునిస్తానన్నావు వరమిస్తానన్నావు...కరువైమెడకు ఊరి అయిపోయావు
దేవతలోను ద్రోహంఉందని తెలిపావు..దీపంకూడా దరియిస్తుందని తేల్చావు
ఎవరిని అడగాలి నన్ను తప్ప..ఎవరిని నిందించాలి నిన్ను తప్ప..

నీవంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని.


నా మనసుని ఎందుకిలా వేధిస్తావు

నా మనసుని ఎందుకిలా వేధిస్తావు
నా కలలని ఎందుకిలా కాజేసావు
నా ఆలోచన నీ చుట్టూ కదుల్తోంది
పదాలన్నీ నీ పెదాల మాటున దాచి
కలలన్నీ నీ రెప్పల చాటున వుంచి
వదలలేక కదలలేక నీకై నేనెదురు చూస్తున్నా ప్రియా

ప్రియా నాలో ఏమిటీ మార్పు నీవేఅంతా అనే ఆలోచన

మనసులోని మాటలన్నీ కమ్మని తెమ్మెరగా నన్నూ
నా ఆలోచనలనీ వెతికి వెతికి కమ్ముకున్నాయి
చిరు చీకట్లలో చిటికెడంత ముద్దు నన్ను తాకిందని
నేను తేరుకునే లోగా నీ నవ్వుల వాన, నీ మాటల
నీ జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసాయి ఇంతలో
నన్ను ఓ వరం మెరుపులా తాకింది నీ చారెడు కళ్ళు
నన్ను వెనకనుంచి జ్ఞాపకాల వలతో పట్టేసాయి 

ఎందుకు నీ ఆలొచన నన్ను ఇలా తరుముతోది
నిన్న నే చూసిన కలా? లేక ఈరొజు నాకు అందిన
అందమైన సహసంభాషణ సహచర్యమా
నాలో ఏమిటీ మార్పు నీవేఅంతా అనే ఆలోచన
మనసులో మాటలో పదములో పెదవులో
అడుగడులో మరీ మరీ నీ ఆలొచన ఎమీ
రేపు నీ సుందర రూపం ఎలా చూడను?
నా నిద్రను కాజేయమని నా కలను జయించమని
మనసులో మధురంగా ఉన్న నీరూపం నాతోనే
అనుకుంటూ నిద్రను కోరనా, కలను రమ్మననా 
ప్రియా

నీ జ్ఞాపకాలు నన్ను పదే పదే పలకరిస్తాయి

నేను ఒంటరిగా ఉన్నపుడు
నీ జ్ఞాపకాలు నన్ను  పదే పదే పలకరిస్తాయి
మనమిద్దరం కలసి పంచుకున్న కాలం ఆవిరైపోతూ
నీకూ నాకూ మధ్య తరగని దూరాన్ని
కరిగించాలని తపనగా తనవంతుగా
చూపి నెమ్మదిగా మాయమయ్యింది
నేను మాత్రం నిన్న నీవు వొదిలిన జ్ఞాపకాల మధ్య
నీ నవ్వులను ఏరుకొంటూ నానుంచి నేను తప్పిపోయాను ప్రియా

Monday, April 22, 2013

ఓపలేనంత బరువు..తట్టుకోలేనంత చీకటి

ఓపలేనంత బరువు
తట్టుకోలేనంత చీకటి
ఆపలేనంత పరుగు
అందనంత దూరం
తీర్చలేనంత దిగులు
తట్టూకోలేనంట ఆందోళన
చెప్పుకోలేనంత వేదన
తీర్చలేనంత ఆరాటం
ఇలా నీవెక్కడున్నావంటూ
నా మనస్సు నీకోసం
తడుముతూనే ఉంది ప్రియా

ఈ జ్ఞాపకాల ఊపిరి ఆగిపోకముందే ..నను చేరు నా ప్రాణమా...!



నాతోవున్నపుడు నీనీడను వదలలేదు,
నాతో లేనపుడు నీజ్ఞాపకలను వదలలేదు ఈ నామది
నీ ప్రతి జ్ఞాపకం...నా తోడో ..బాధో తెలియడం లేదు
నీ కాలి సిరిమువ్వలకు వేదికైన ఈ నా హృదయం
ఇపుడు .. నీజ్ఞాపకల క్రింద పాతాలమై పోతోంది
అలనాటి నీ చిరునవ్వులు గుర్తొచ్చి పెదవులు వికసించినా ..
ఈనాడు అదే చిరునవ్వు లేదని నా కన్నులు వర్షిస్తున్నాయి.
ఈ ప్రపంచానికి నీవోక్కదానివే.. కానీ ..
నాకు మాత్రం నువ్వే ప్రపంచమైపోయావు.
ఈ జన్మకు ఇది చాలనుకున్నా నీవోడిచేరి పసిపాపనైన ఆ క్షణం. కాని...
మరుజన్మకూ, జన్మ జన్మలకూ నీవే కావాలనుంది ప్రతి క్షణం
వలచి వరించిన నీ మనసు ఏమంటోంది ?
నన్ను వదిలేయమందా ?

నేనే నీ ప్రాణం అన్న నీ ఊపిరి ఏమైంది ?
కొత్త ఊపిరి పోసుకుందా ?
నీతో వున్న ప్రతి క్షణం స్వర్గమైంది
నీవు లేని ప్రతి స్వర్గం నాకు నరకంగానే వుంది.
ఆ స్వర్గలోకపు జ్ఞాపకాల ఊపిరితో బ్రతుకుతున్నా ఈ నరకంలో ..,
ఈ జ్ఞాపకాల ఊపిరి ఆగిపోకముందే ..నను చేరు నా ప్రాణమా...!
ఆగిపోయిన ఊపిరి సైతం ఉప్పెనవుతుంది.. నీ నీడతాకితే..
ప్రతి క్షణం నిను తలిచే నా హృదయం ఆగితేనే నీ జ్ఞాపకం ఆగుతుంది ఆ క్షణం

ఆశపడటంలో తప్పు లేదు ....ఆశ నిజం అవ్వాలనుకోవడమే నా పిచ్చి కదా..?

ఇన్నిన్ని అక్షరాలతో నిన్ను కీర్తిస్తున్నా...
ఇన్నిన్ని పదాలతో నిన్ను పూజిస్తున్నా...
ఇన్నిన్ని కవితలతో నా మనోబావలను తెలుపుతున్న..
ఇన్ని చేసిన నాకు, నీవేమి చేయగలవు...?
ఒక్క పదమై పలుకలేవా భావనలుపెదవిపైన...
ఒక్క క్షణమైనా చూడలేవా కలమపైన...
ఒక్క గడిఅయినా ఒప్పుకోలేవా నాది ఉహ కాదు నిజమని...
ఒక్క మాటైన చెప్ప్పలేవా నా ఉహకి మొదట ప్రాణం పోసింది నువ్వేనని...
ఇంతకన్నా నిన్నేమి అడగను...
ఇంతకు మించి నిదగ్గర ఏమి ఆశించాను...
నేను కోరేది ఒక్కటే...
ఈ అలజడి..
నాది కల్పనన కాదని, నీవు కలిస్తే అన్నీ నిజాలేనని
నిజం నీవు ఒప్పుకోవాలని...
నా ఆలోచన తప్పుకాదని చిన్న ఆశ...
ఆశపడటంలో తప్పు లేదు ....ఆశ నిజం అవ్వాలనుకోవడమే నా పిచ్చి కదా..?

రాయాలనిపిస్తోంది.......?

రాయాలనిపిస్తోంది.......
పచ్చని కొమ్మని చూసి
విచ్చిన పువ్వుని చూసి
వయసు ఊయల ఊగుతు ఉంటె
మనసులో ఉహాలు ఎగురుతూ....ఉంటె
పరువపు పండును చిలక కొరుకుతూ ఉంటె
బుగ్గపై సిగ్గు ఎర్రగా.... పండుతు ఉంటె
తొలి వలపు సోయగాల ఊసులు...
కొన్ని భావాలు నా పెదవులు పలకలేనప్పుడు
నీ తలపులతో నా మది మూగగా 

రోదిస్తున్నప్పుడు రాయాలనిపిస్తుంది.

తెల్ల గులాబీ లాంటి మనస్సుకు..అవమానం అనే రక్తపు మరకలంటించావు






తెల్లని గులాబీ లా స్వచ్చంగా ఉండాలని
నవ్వుతూ నీతో జీవితం పంచుకోవాలని
సంతోషంలో .భాదలో నీకై నేనుండాలని
నీకు నేను గా నాకు నీవుగా ఉండాలని
మనసులో.దాచుకొని చూసుకోవాలని
మది అంతరంగంలో నిలచుకోవాలని

ఎన్నీ కలలు కన్నాను
అన్నీ నిజమనుకున్నాను
మాటలన్నీ నిజాయితీ ఉందనుకున్నాను
నాకోసమే నీవు పుట్టావనుకున్నాను
నా కష్టాల్లో నీవు కోండత అండ అనుకున్నాను

తుఫానుల ఇద్దరి మద్యా పెరిగించి దూరం
ఎవరో పెట్టారు మనమద్యి వైరం..

కల్లలో పెట్టుకొని చూసుకున్న
నాకు కళ్ళలో నీళ్ళు తెప్పించావు
తెల్ల గులాబీ లాంటి మనస్సుకు
అవమానం అనే రక్తపు మరకలంటించావు

తెల్ల గులాబీ లాంటి మనస్సుకు..
అంటినీ రక్తపుమరకలు అనుకున్నా
కాని గుండెళ్ళో గుచ్చుకుంటున్న
జ్ఞాపకాల కత్తులకు కారుతున్న రక్తం
అని గుర్తించలేకపోయా..
అదీ ఇప్పుడు నా ప్రానం తీస్తోంది
నీవు కనికరించి ఒక్క పలకరింపుతో నైనా నన్ను
ఓదారుస్తావని ఆశ ఇప్పుడు చచ్చి పోతోంది
నీన్ను చేరాలనే ఆశ
గుండేల్లోనుంచి రక్తంలా చిమ్ముతోంది
అన్నీ నీకు తెల్సు. ..
తెల్లని గులాబీ రక్తంతో ఎర్రగా మారినా
చూసి కూడా చలనం లేకుండా వున్నావు..
అలా ఎలా ఉండగలుగుతున్నావు
ఒకప్పుడు ఎంతో ప్రేమగా..జాలిగా..
నాకేం జరుగుతుందో అని కంగారు
పడ్డ మనిషి.. ఇష్టపడ్డ మనిషి చనిపోబోతున్నా
అంత నింపాదిగా ఉండటం అది నీకు మాత్రమే సాద్యిమేమో

Sunday, April 21, 2013

ప్రియా ప్రేమంటే ఇది తెలుసా


క్షనం క్షనం నేను కాలిపోతున్నా నీ ఆలోచనలతో

మనసా ఈ క్షణం ఇలా ఆగి పోనీ
రేగిన గాయాన్ని మాపే కాలం తో జతకట్టలేను
నన్ను తనలో పొదుగుకున్న రాత్రి కరిగిపొతున్న భయం
నీడ చూడాల్సిన వెలుగుజాడ లో నే కరగలేను

ఈ క్షణం ఇలా ఆగి పోనీ..నన్ను నాలొ చూసుకునే అద్దం లాంటి రాత్రి
చీకటీ వాకిట్లోని మసక వెలుతురే నీకై తపించిన
నా నన్నును నాకు దూరం చేస్తుందన్న దిగులుఎన్నాళ్ళో ఎన్నేళ్ళో తెలీదు మనసా

గతం లోతుల్లో నేను నా లానే ఉండిఉంటా
క్షనం క్షనం నేను కాలిపోతున్నా నీ ఆలోచనలతో
నన్నే నేను పోగొట్టుకున్నా మనసా.
సాయంత్రాలు నీజ్ఞాపకాలను మనస్సులో వెతుక్కుంటున్నా మనసా

నన్నే నేను ఏమార్చనీ మనసా
నేనంటూ మిగిలుండాలన్న నీ జ్ఞాపకాల నీడల్లో
అనుక్షణం నీకై పరితపిస్తున్నాను మనసా
ఎందుకింత కాంక్ష ..ఎన్ని సార్లు మానసునడిగినా సమాదానం లేదు
మనసా జన్మ జన్మల బంధమా నువ్వే గెలవాలి
కానీ ఈ తిమిర సమరం లో ఈ ఒక్క క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలో నిలిచి పోనీ మనసా,
నా చివరికోరిక నీవే ఎప్పుడూ గెలవాని నేనోడినా పర్లేదు
నీగెలుపు నాకు ముక్ష్యిం నేనైమైనా పర్లేదు మనసా

చాలా చాలా మారిపోయావు వాడి దగ్గర నన్ను వెటకారం చేసేంతగా

ఎందుకు నన్ను  ప్రేమించలేదు నేస్తం
ప్రేమించానని నీకు చెప్పినప్పుడు ఎప్పటికో నీవు షడన్ గా I Love you అన్నప్పుడు
ఏదో తెలియని ఫీలింగ్ నిజమేనా అడిగితే కాదా అని నీవన్నప్పుడు ఏదో దైర్యం

అలా సాగుతున్న మన మాటల ప్రవాహానికి ఎవ్వరో అడ్డుకట్ట వేశారు
నీవు నన్ను దూషించావు.. నా ప్రేమకు నీవు పెట్టిన పేరు " అపహాస్యిం" అని
నీవేంటి నేనేంటి అని పరిదులు తెల్సుకో అన్న మెస్సేజ్ .. అనుబాంబుకంటే ఏక్కువగా
ఇప్పటికీ నాగుండేల్లో పేలుతూనే ఉంది ..ఏంచేస్తున్నా వని చూస్తే మరొకల్లతో హేపీగా ఉన్నావు
 

చాలా చాలా మారిపోయావు వాడి దగ్గర నన్ను వెటకారం చేసేంతగా మారిపోయావు
మద్యిలో ఎందరో స్నేహాలు అప్పుడప్పుడు కనిపించే నీవు ఇప్పుడు 

కనిపించకుండా కావాలని దూరం అయ్యావు కావాలని నాకు మాత్రమే కనిపించకూడదని
నీ  ప్రేమ దొరకక నా కన్నుల నుండి జారిపడ్డ కన్నీరు ఇంకా తడి ఆరక నా పాదలపై మెరుస్తుంది,
ఎరుపెక్కిన నా  కన్నులలోని రక్తఛార ఇంకా నా కనుపాపల నుండి చెరిగిపోకుంది.
మూగబోయిన నీ స్వరపు మౌనరాగం నా గుండెను గాయం చేస్తుంది,
ఎలా తెలుపను నేస్తమా నా స్నేహభావాన్ని,
ప్రేమను స్వీకరించలేక,స్నేహన్ని దూరం చేసుకోలేక నేను,
స్నేహాన్ని వదులుకోలేక,ప్రేమను పొందలేక నువ్వు,
మౌనపుసంద్రానికి చేరో ఒడ్డున నిలిచిపొయాము.
నేస్తమా ఎలా సమాధాన పరచాలి నిన్ను?


రాధకోసం కృష్టుడు..కృష్ణుడికోసం రాధ కాదా..


రాధా కృష్టులను చూస్తే..రాధకోసం కృష్టుడు..కృష్ణుడికోసం రాధ కాదా..
కృష్టుడు రాధ గురించి ఆలోచిస్తున్నాడు అంటేనే...రాధగుండె అదురుతుంది..
.కృష్టుడు రాదను చేరగానే...అదరంలో అందమైన మలుపులు
పెదవిచాటున... పడ్డగాటు ఎర్రగా కనిపించి కృష్టుడికి అది రెడ్ సిగ్నల్..ఇంకేముంది ఆగలేనంటూ అదరాలను అందించేందుకు రడీగా ఉండేరాధ..కృష్టుడి చేయి తగలగానే..మంచు ముత్యంలా కరిగిపోతుంది మరి..మరి,,ఆ విరహ వేదనను..వేయి యుగాలుగా ఎదురు చూస్తున్న రతీదేవిలా కృష్టుడికి విల్లులా సహకరిస్తుంది రాధ..? రాదా కృష్టులు ప్రేమకు ప్రతిరూపం..కార్యానికి కందం తొక్కితే ఆ యుద్దం ఎన్ని యుగాలైనా ఆగదు ముద్దులతో మొదలైన యుద్దం.. మొదలు కాగానే రతీదేవుడే సిగ్గుతో ముడుచుకు పోవాల్సిందే ...సముద్రపు హోరులా ప్రారంబమై..అగ్నికీలల్లో ఆహూతి ఆహూతి అవుతూ...మరో కొత్తలోకంలో విహరిస్తున్న ,,ఆ రాధాకృష్టుల ప్రణయగాధ చెప్పటానికి ఎన్ని యుగాలైనా పెనంమీద అయిసుగడ్డలా అలాఅలా కరిగి పోవాల్సిందే కదా..?

నాతో నువ్వున్న క్షణాలను నిర్ధాక్షిణ్యంగా మింగేసిందీ కాలం

నాతో నువ్వున్న క్షణాలను
 నిర్ధాక్షిణ్యంగా మింగేసిందీ కాలం
ఒంటరిగా నేను వెనక్కి తిరిగి 

చూసుకుంటే తడిమిందో గాయం

రెక్కలు తొడిగిన వూహలన్నీ వెచ్చని కలలుగా మారి
నీ సహచర్యం కోసం ఎన్నాళ్ళు గానో ఎదురు చూస్తున్నాయి

నిను మెచ్చిన వాళ్ళెందరో కదా
నేను వాళ్ళందరిలో చివరెక్కడో

నీకో నిజం తెలుసా!!

కరిగి పోయిన కాలాన్ని అడుగు,తొక్కిపెట్టిన నీ ఊహలను
మన చేతుల మధ్య జారిపోయిన ఊసులను అడుగు
నీ మనసు చాటున అదిమి ఉంచిన నా తీపిగుర్తులు
అలా తెరలు తెరలుగా నిన్ను ఉప్పెనగా ముంచెత్తుతాయి
క్షనం ఒకయుగంలా గడుపుతున్నా ...ఆ రోజుకోసం వస్తుంది త్వరలో..
ఓ ఉప్పెన నన్ను కబలించి కనిపించని లోకాలకు తీసుకెలుతుంది

ఏకాంతన్నే ప్రేమిస్తానని ఎప్పటిలాగే ...

ఏం చెప్పనులే ఇక విరిగింది మనసని .......
నన్ను పొమ్మంది నా ప్రాణామేనని........
నన్ను ముంచే నది నా కన్నీటిదేనని..........

ఏం చెప్పనులే..
మనిషి కాలిపోయేది చితిలోనేనని ....
మనసే కలిపోయక మిగిలేదేముందని .......
తనువు మనసు నిండాయి జ్ఞాపకాలతోనే నని........
మరిచే దారి తెలియక మానై నిలిచానని .......

ఏం చెప్పనులే...
ఏకాంతన్నే ప్రేమిస్తానని ఎప్పటిలాగే ...

ఇక ఏ బంధాన్ని నమ్మను పొమ్మని ...ఏం చెప్పనులే.
పున్నమి వెలుగులు మింగేసేది అమావాస్య రాత్రేనని .......
అంతకు మించిన చికటినేదో నాకోదిలేసావని..........
నీకోసం ఏడ్చిన రోజే నవ్వాలే నేనేంటో నని ......
నా కంట్లో నీటిని చూసి ఎన్నాళ్ళైందో ఏంటో నని .....

ఏం చెప్పనులే.
ఏకాంతన్నే ప్రేమిస్తానని ఎప్పటిలాగే ...

ఇక ఏ బంధాన్ని నమ్మను.
ఏం చెప్పనులే

నా రక్తపు మరకలు ఇంకా అంటని నా మనసు కాగితం ఫై ఏదైనా రాయండి .

ఎక్కడ వున్నాయ్ ఆ దివ్య లోకపు మంటలు ......
మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను నన్ను దహించండి.......
ఎక్కడ వున్నాయ్ ఆ అనంత ప్రేమ సాగరాలు ....
వేడుకుంటున్నాను నన్ను మీలో నిమజ్జనం చేయండి ..
ఎక్కడ వున్నారా కాలాతీత జ్ఞానులు ......
ప్రార్థిస్తున్నాను నా రక్తపు మరకలు ఇంకా అంటని
నా  మనసు  కాగితం ఫై ఏదైనా రాయండి ....
నీ ఆలోచనలు సూది మొనలా చిత్ర హింసలు పెడుతున్నాయి......
నా అస్తిత్వాన్ని మరిచేలా ఎవరైనా ఏదైనా చేయండి ప్లీజ్

నలిగిన నామనస్సును చిదిమేయి ప్రియా
నేనీ చిత్రవధను అనుభవించలేను
రోజు రోజుకి  నా ఓపిక నసిస్తుంది
నీరసం ఆవహిస్తుంది ఆలొచన మందగిస్తుంది
మతితప్పి గతిమారుతోంది ఏదో జరుగుతోంది ప్రియా 

Saturday, April 20, 2013

మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా


కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......

నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......
భావుకతతో వర్నించలేను...నాకు తెల్సింది నాకు నచ్చింది రాస్తున్నాఇలా..
నా నరనరాన జీర్నించుకుపోయిన నీమీద ఇష్టాన్ని చెబుతున్నా ఇలా..

నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అయితే ఏంటంటా అని అంటావు నీవు ....నాకు తెలుసు....
మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.
ఈ మౌనం ముసుగులో ఉంది నేను మాత్రమేకాదు నీవుకూడా..ఎందుకని ప్రియా..
ఇద్దరి మద్యి మౌనం నరకం అని తెల్సి ఎందుకిలా ఎన్నాళ్ళిలా ప్రియా...?