I Hate Balayya.com నిర్వాహకుల గుట్టు రట్టు చేసిన జీ 24 గంటలు..i Hate chiru and I Hate rajini సైటల నిర్వాహకుడు ఒక్కడే అని తేల్చి సంబదిత వివరాలు సేకరించి సైబర్ క్రైం పోలీసులకు వివరాలు అందించిన జీ 24 గంటలు..ఇదంతా కూడా ఏడ్ రెవెన్యూకోసమే అని తేల్సి..సదరు వ్యక్తివివరాళు పోలీసులకు అందించిన జీ 24 గంటలు క్రైంరిపోరటర్ ఇన్నారెడ్డి మరో ఇద్దరు ok
ఐటి నిపునులు సహాయంతో ఈ సైట్ల నిర్వాహహకుని గుట్టును సైబర్ క్రైం పోలీసులకు ఇవ్వడం జరిగింది ..గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ihatebalayya.com, ihatechiru.com, ihaterajini.com వంటి పలు వెబ్ సైట్లకి సంబంధించిన కీలకమైన వివరాలను ఆనేక సాంకేతికాంశాలను పలు కోణాల్లో పరిశీలించి "సైబర్ క్రైమ్ హెల్ప్" బృందం సేకరించింది. జీ 24 గంటలు..సహకారంతో వీటిని సైబర్ క్రైమ్ పోలీసు విభాగానికి అందించడం జరిగింది. Zee 24 గంటలు ఛానెల్ క్రైమ్ రిపోర్టర్ ఆదూరి ఇన్నారెడ్డి, కంప్యూటర్ ఎరా తెలుగు పత్రిక ఎడిటర్ నల్లమోతు శ్రీదర్, కృష్ణారెడ్డి అనే మరో మిత్రుడు, మరికొందరు న్యాయ నిపుణులు, మీడియా ప్రతినిధుల సహకారంతో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికీ, సైబర్ నేరాల బాధితులకు మా వంతు సహకారం అందించడానికి http://cybercrimehelp.com అనే వెబ్ సైట్ ని సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాకు దొరికిన కీలక సమాచారాన్ని విశ్లేషిస్తే మాకు అన్పించింది ఒక్కటే.. సైబర్ ప్రపంచంలో ఎవరూ పట్టించుకోనంత వరకే ఎవరైనా అనానిమస్ గా ఉండగలరు, ఏమైనా చేయగలరు. ఏదైనా బలమైన సందర్భం తటస్థిస్తే వారి వివరాలను సేకరించడం, వారి గోప్యతను బయటకు రప్పించడం చాలా సులువని! సో మిత్రులూ… సైబర్ నేరాల బారిన పడకండి, సైబర్ నేరాలను ఎదుర్కొనే పటిష్టమైన వ్యవస్థ మన సైబర్ సెల్ పోలీసుల వద్ద ఉంది. నిన్న 45 నిముషాలకు పైగా సైబర్ క్రైమ్ విభాగం వారితో "సైబర్ క్రైమ్ హెల్ప్" బృందం గడిపినప్పుడు ఇలాంటి ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. మున్ముందు సామాన్య కంప్యూటర్ యూజర్ సైబర్ నేరాల బారిన పడకుండా "సైబర్ క్రైమ్ హెల్ప్" తన వంతు బాధ్యతని నిర్వహిస్తుంది.
జీ 24 గంటలు న్యూస్ చానల్ లో బ్రేకింగ్ ష్టోరి తాలూక వీడి యో చూడగలరు