. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, March 24, 2011

నువ్వు నా ఫ్రెండ్‌విరా...జీవితాంతం నిన్ను మర్చిపోను



శీనుకు విమల, లతిక, దివ్య అంటే ప్రాణం. టీనేజ్‌లో శీను మనసులో తొలిప్రేమ విత్తు నాటిన అమ్మాయి విమల. ఇక లతిక అయితే కాలేజ్ ఏజ్‌లో శీను హార్ట్‌వేర్‌లో లోడ్ అయిన సరికొత్త సాఫ్ట్‌వేర్. మరి దివ్య? శీనుకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే.
స్నేహం, ప్రేమ ఒకటి కాదా? రెండూ వేర్వేరా? చాలా మందికొచ్చే డౌటే అది. అలాంటి వాళ్లకు దివ్యను పరిచయం చేస్తే అసలా డౌటే రాదు.
దివ్య... జలతారు వెన్నెలను జిరాక్స్ తీసినంత అందంగా ఉంటుంది. అందంలోనే కాదు.. ఎదుటివారిని ఇన్‌స్పైర్ చేయడంలోనూ తన తర్వాతే ఎవరైనా. అప్పుడే కొత్తగా హైదరాబాద్‌కొచ్చి ఉద్యోగాల వేటలో తిరుగుతున్న శీనుకి ఉద్యోగమిప్పించింది తనే.
దివ్య పరిచయం కాకపోతే శీను ఓ దేవదాసులా మిగిలిపోయేవాడు. విషాదంతో చెలిమి చేసేవాడు.జీవితంలో చితికిపోయి చితి వరకూ పోయేవాడు.దివ్య అతని గాయాలకు లేపనం పూసింది. పాత జ్ఞాపకాల వడగాల్పుల్లో విలవిల్లాడుతున్న అతనికి చల్లటి ఓదార్పునిచ్చింది.
దివ్య పరిచయమయ్యేనాటికి శీను కళ్లలో కలలులేవు... కన్నీళ్లు తప్ప. లతికను మరిచిపోలేక సుదీర్ఘ నరకం అనుభవిస్తున్నాడు.

పాత జ్ఞాపకాలు మరిచిపోవాలంటే కొత్త జీవితం మొదలుపెట్టాలంటుంది దివ్య.అలాగని తన జీవితమేమీ నల్లేరు మీద నడక కాదు.
చిన్నప్పుడే తండ్రి పోయాడు. పెంచి పెద్ద చేసిన తల్లిపై కాలం పక్షపాతం చూపించి పక్షవాతం బారిన పడేలా చేసింది. ఇంకో పక్క ప్రేమంచిన వాడు ఆమె గుండెకు గాయం చేసి వెళ్లిపోయాడు. ఈ కష్టాలకు బోనస్ అన్నట్టుగా క్యాన్సర్ దివ్యను చుట్టుముట్టింది. ఓ దశలో ఆత్మహత్యకు తలపడింది కూడా. తర్వాత తేరుకుంది. జీవితమంటే పోరాటమని అర్థమైంది. సమస్యలకు ఎదురు నిలవడమని తెలుసుకుంది. ఆ క్షణం నుంచి తన మా అమవాస్య నిశిలో ఉన్నా కూడా ఇతరులకు చంద్రోదయాన్ని పంచసాగింది.
దివ్య ఒక దీపం.
దివ్య ఒక చిరుజల్లు
దివ్య ఒక ఓదార్పు
దివ్య ఓ దిక్సూచి
దివ్య... రెండక్షరాల జీవితం. రెండు యుగాల అనుభవం. గుండెనిండా సరిపోనంత పరిమళం.
ప్రతిక్షణం శీను లైఫ్‌ని రీఛార్జ్ చేసింది దివ్య.

అలాంటి స్నేహితురాలు అండగా ఉంటే ప్రపంచాన్ని ఒంటి చేత్తో గెలవొచ్చుననిపించింది శీనుకి. బంగారపు పళ్లానికైనా గోడ చేర్పు కావాల్సిందే. శీనుకు అలాంటి గోడ చేర్పే దివ్య. శీనుకు తొలిసారిగా ఓ యాడ్ ఫిల్మ్‌ని డెరైక్ట్ చేసే అవకాశమొచ్చింది. దివ్య సంబరానికి అంబరమే అడ్డు.
కానీ, కాలం మరోగాయం చేసింది. దివ్య తల్లి చనిపోతుంది. ఆ బడబాగ్నిని తన గుండెల్లోనే దాచుకుంటుంది తప్ప శీనుతో షేర్ చేసుకోదు. ఎక్కడ అతడు డిస్టర్బ్ అవుతాడోనని. అంతా అయ్యాక శీను గుండెలపై వాలి భోరున విలపిస్తుంది. ‘‘ఎందుకురా... ఇంత దుఃఖాన్ని భరించావ్’’ అంటాడు శీను. ‘‘నీకోసమే... నువ్వు పైకి రావాలనే... నువ్వు నా ఫ్రెండ్‌వి రా...’’ అని చెబుతుంది దివ్య నిజాయితీగా. చనిపోయేవరకు ఇలాంటి స్నేహంతోడుండాలని కోరుకుంటాంకదా..ఎంత కాలం బ్రతికి ఉన్నాం అనికాదు ఇలాంటి స్నేహితులను సంపాదించుకుంటే జీవితం దన్యిం అయినట్టే కదా

దివ్య ఎంత గొప్పది?ఆమె గొప్పతనాన్ని కొలవడానికి కేజీలు, కేలరీలు... ఇలాంటి కొలమానాలు ఎక్కడ సరిపోతాయి.
నిజమైన స్నేహానికి కొలత లూ కొలమానాలూ ఉండవు కదూ!హేట్సాఫ్ దివ్య!అలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు శీను చాలా అదృష్టవంతుడు కదూ.అలాంటి స్నేహితురాలు ఉంటే జీవితంలో అన్నీ సాదిస్తావు అందుకే ‘‘దివ్యను ఒక్కసారి చూడాలని ఉందిరా’’ అంటాడు శీను ఫ్రెండ్.
నిజమే... ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.అలాంటి స్నేహితులు ఎప్పుడు ఎదురుగా ఉండీ దైర్యించెప్పాలని కోరుకుంటారు
అందుకే ‘నా ఆటోగ్రాఫ్... స్వీట్ మెమొరీస్’ సినిమాలో దివ్య పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.