Wednesday, March 16, 2011
ఆంద్రప్రదేశ్ లో వికీలిక్స్ టీం గా తయారవుతున్న యువత
ఆంద్రప్రదేశ్ లో వికీలిక్స్ టీం గా తయారవుతున్న యువత...ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలకు నిలవు వికీలిక్స్ న్యుస్...ప్రపంచంలో జరిగే అన్యాయాలను అనేక రహస్యాలను గుట్టు రట్టు చేస్తూ...ఎప్పుడు ఎవ్వరి బండారం బయటపడుతుందో అంటూ బడాబాబులు బయపడుతున్న రోజులు..ఈ వికిలిక్స్ ప్రధాన సంపాదకుడు " డేవిడ్ అసాంజే " ను ఆదర్శంగా తిసుకొని కొందరు యువకులు దేశంలో జరిగే అన్యాయాలను బట్టబయలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుసమాచారం... ఈ విషయమై కొందరు యువకులు నాకు కొంత సమాచారం కూడా ఇచ్చారు.... వికీలిక్స్ అదినేత ను ఇప్పటికే కాంటాక్టు అయి....ఆంద్రపదేశ్ గురించి అన్ని వివరాలు వివరించి తాము చేయాలనుకున్న చేయబోయే విషయాల గురించి చర్చించారు...రాజకీయ నాయకుల పై ఇప్పటికే కొన్ని భానాలు ఎక్కు పెట్టారు...మీడీయాలో ఉన్న వ్యక్తిగా నా సహాయం అడిగారు తప్పకుండా చేస్తాను అని చెప్పాను...మీకు త్వరలో ఓ మైల్ ఐడి ఇస్తాను దానిలో మీరు మాతో సమాచారం షేర్ చేసుకోవచ్చు.....
ఇప్పటికే రెండున్నర లక్షల పైగా అమెరికన్ దౌత్యిపత్రాలతో,ఐదు వేలకు పైగా బారత దేశానికి సంబందించిన కీలక పత్రాలను వికీలిక్స్ బయట పెట్టడంజరిగింది ఇలా అనేక కీలక పత్రాలు బయట పెడుతు ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలు అక్రమాల చిట్టాల ను బయపెట్టి సంచలనం సృష్టిస్తున్న సంగతి తెల్సిందే...గతంలో తెహల్కా డాట్ కాం కుడా ఇలా అనెక మంది అక్రమార్కుల గుట్టు రట్టు చేసింది...ఇప్పుడు వికీలిక్స్ ను ఆదర్శంగా తిసుకొని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ విదానాలు ప్రభుత్వ అదికారులు ప్రజల సొమ్మును ఏవిదంగా దుర్వినియోగం చేస్తున్నారు అన్న విషయాల పై దృష్టిపెట్టాలని ఈ యువత భావిస్తున్నట్టు సమాచారం దీనికి సంబందించి పూర్తి సమాచారం ఇంకా రావల్సి ఉంది..వారు అనుమతి మేరకు విషయాలన్నిటిని నాబ్లాగ్ లో పెట్టే ప్రయత్నం చేస్తారు...వారు కుడా తెలుగులో వికీలిక్స్ వెబ్సైట్ క్రియేచేస్తున్నరని సమాచారం...అని వివరాలు త్వరలో అందించగలను మంచి ఉద్ద్యేశ్యంతో ముందుకు వెలుతున్న వీరు ఏవిదంగా విజయంసాదించగలరో వేసి చూడాల్సిందే