Sunday, March 13, 2011
ఎగసి పడే భాధనంతా..గుండెళ్ళో దాచుకోలేక పోతున్నా
ఎగసి పడే భాధనంతా..గుండెళ్ళో దాచుకోలేక పోతున్నా
నీ తలపులతో కంట కన్నీరు..ఆగనంటుంది
గుప్పెడంత గుండెలోన..ఇంత భాదను ఎలాదాచుకోను
నీవు నాతో లేవన్న నిజం...ఖటిన మైన వాస్తవం
నిజం కాకూడదని ఇంకా అనుకుంటూనే ఉంది పిచ్చి మనస్సు
మనస్సుకు ఆనిజాన్ని ఇంకా చెప్పలేదు..తెలిస్తే ఎంటనే ఆగిపోతుంది
చెప్పకపోతే ఆగమాగం చేస్తుంది..చెబితే ఆగిపోతుంది చిన్ని గుండె..
నీవు గుర్తుకు రాగానే..కంటి చూపు మసకబారుతోంది కంట కన్నీటితో
గుండె వేడెక్కి పోతుంది..ఆవేడి ఆవిర్లు గుండెల్లో మంటలు రేపుతున్నాయి ..
ఇంత భాద నే బరించలేకున్నా....నా జీవితంలో కమ్ముకున్న చీకట్లు..
ఆచీకటి అలాగే ఉండి...చీకటిలో కల్సిపోతే ఎంతబాగుండో అనిపిస్తుంది..
అదే జరగబొతోంది..రేపటి ఉదయాన్ని చూడలేనేమో అనిపిస్తోంది..
ఆ రేపటిలో నీవులేనప్పుడు నాకెందుకు అనిపిస్తోంది..
నీవులేని నేను లేనన్నది నిజం...ఆ నిజంత్వరలో సమాది కాబోతుంది
Labels:
కవితలు