Thursday, March 17, 2011
మాటలకందని భావాలు మనసులో ఉన్నా అవి నీకు తెలిపేదెలా...?
మాటలకందని భావాలు మనసులో ఉన్నా అవి నీకు తెలిపేదెలా...
అవి నీకు చెప్పాలని మనసువిప్పాలని ఉంది బావం నీకు తెలిసేదెలా..?
మనసుపొరల్లో దాగిన ఎన్నో నీకు చెప్పాలని చుస్తున్నా ఆశగా..
మనిషిని మాత్రం మిగిలి ఉన్నా..మనసు నీదగ్గరే ఉంది అది పదిలమా..
నిన్ను చూసి ఎన్ని రోజులైంది..ఎప్పుడు చూస్తానో కదా..?
మాటలకందని మౌనం నన్ను వేదిస్తుంది...ఎన్నాళ్ళిలా అని..
నీవు లేని నేను అని పదే పదే మనస్సు నిన్ను గుర్తుకు తెస్తుంది..
అప్పుడప్పుడు ఎలావున్నావంటూ ఒక్కపలకరింపు చాలు నాకు..
...నీ మాటల్లో ఉన్న మత్తు అలాంటిది..కాని దూరం అయ్యాం..
మనిషి కీ,మనసుకు మధ్య అడ్డుగోడలున్నాయి ఎలా కలుసుకోగలం చెప్పు..
నీ కళ్ళలోకి చూస్తూ ప్రపంచాని మరచిపోయేనేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసా..?
నీవు లేని నేను ఎలా వుంటాను అని ఒక్కసారైనా తలచుకున్నావా ఎప్పుడైనా
నీవు నమ్ముతావో లేదో కాని ప్రతి క్షనం నిన్ను గుర్తుకు తెచ్చుకుంటాను ఇప్పుడేం చేస్తుంటావో అంటూ..
అంతకు మించి ఏమి చేయగలను దగ్గరగా ఉండి...శత్రువుల్లా దూరంగా మనం అని తలచుకుంటే వింతగా ఉంది..
Labels:
కవితలు