Thursday, March 3, 2011
"స్నేహమా"...ఏమని చెప్పను ...?
"స్నేహమా"
ఏమని చెప్పను ...
విస్తరించిన వెల కట్టలేని వెన్నెల "స్నేహం"
మలినం లేని మృదువైన మౌనం "స్నేహం"
బంధుత్వం అవసరం లేని బలమైన బంధం "స్నేహం"
మమతలతో మైమరపించే మహా మాయ "స్నేహం"
ఆప్యాయతలతో అలరించే అనుబందం "స్నేహం"
వివరణలు అడగని విలువైన వాస్తవం "స్నేహం"
నిరూపణలు కోరని స్వచమైన నిజం "స్నేహం"
సరిగమలు అక్కర లేని వినసొంపైన సంగీతం "స్నేహం"
ప్రేమానురాగాలకు నిజమైన ప్రతిరూపం "స్నేహం "
కరుణ ,సహృదయతలకు కావ్య రూపం "స్నేహం"
కొందరికే సొంతం ఈ అపురూప వరం ఈ స్నేహం ...
ఇలాంటి అద్బుతమైన స్నేహందొరికింది..కాని దూరం అయింది..
కారనాలు అనేకం...కాలం కసితీర్చుకుంది అని మాత్రం చెప్పగలను..
ఇంతకంటే నామనసులోని భాదను చెప్పలేను..చెప్పినా అర్దంచేసుకునే వాళ్ళు ఎవ్వరు..
Labels:
కవితలు