. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, March 27, 2011

పరిష్కరించుకోలేని ప్రశ్నల్లానే మిగిలి ఉన్నాయి...




ఔనూ
నువ్వెందుకలా ...
నేనెందుకిలా ...
సంధించిన ప్రశ్నలన్నీ
పరిష్కరించుకోలేని ప్రశ్నల్లానే మిగిలి ఉన్నాయి...
ఎప్పుడూ ఏదో వైపునుంచి
దూసుకొచ్చే సందేహాలే కదా ఇవి
మన మనస్సులు దూరం ఎందుకయ్యాయి
తరిగిపోని విషాదంలా..?.


నిజం..అబద్దం అవుతోంది
వాస్తవం..నిర్జీవంగా మారుతోంది
హ్రుదయం వేదన పడుతోంది..
ఏది జరగ కూడదని అనుకుంటానో అదే జరుగుతోంది..
మనసులో మనిషి లేకుండా పోతున్నాడు..

అసలు నమ్మకం అంటే ఏంటి..?
ఇష్టపడటం అంటే ఏంటి..?
ఎందుకు ఇష్టపడతారు..ఎందుకు దూరం అవుతారు..
ఇష్టపడ్డవారు ప్రాణానికి ప్రాణంగా ఎలా ఉంటారు
ఎదన్నా జరిగితే ఒకరికోసం ఒకరు ఎలా భాదపడతారు
అంత ఇష్టం ఎలా పుడుతుంది..అది కష్టంగా ఎలా మారుతోంది..
మనిషికి మనసుకు ఘర్షనలో ఇష్టాలు మారుతాయా ఎలా ..
ఇద్దరూ విడిపోతే ఎదుటివారు భాదపడుతున్నారని తెల్సీ..
ఆనందంగా ఎలా ఉండ గలుగుతారు..కదా..?


కొందర్ని చూస్తే కాలానికుడా కన్నుకుడుతుంది..
ఎటు వైపుచూసినా అన్యాయమే జరుతుంది..
ఇది న్యాయమా అని అడుగలేనంతగా దీనంగా..
ఒకప్పుడు చీకటంటే చిరాకు..మరి ఇప్పుడు..
వెలుగును భరించలేనట్టు ఉంటుంది చీకటి కావాలని పిస్తుంది..
ఒంటరి తనం అనేది లేదు...ఇప్పుడు అదే బాగనిపిస్తోంది..
ఒకప్పుడు చావంటే వద్దనిపించేది...అప్పుడది భయంకర వాస్తవం
ఇప్పుడు ఏరూపంలో ఎందుకు రాదూ అని ఎదురు చూడం అవుతోంది..
ఇన్ని నిజాలు, అబద్దాలుగా మారవా..గతం ఎందుకు తిరిగి రాదు..
కొందరికి ఆలోచించే హక్కు లేదు..ప్రశ్నించే హక్కూ ఉండదు..
కాలం నిర్నయించినట్టు జరుగుతుంది పిచ్చి చూపులు చూడంటం తప్ప ..
ఏం చేయలేం ఆరోజు కోసం ఎదురు చూడు..ఇవన్నీ లేని శాశ్విత లోకంకోసం..