ఒంటరివాన్ని చేసి నీ ఆలోచనలు...నన్ను మొత్తం కమ్ముకుంటున్నాయి
కదిలిస్తాయి,మురిపిస్తాయి..జోకొడతాయి, బెదిరిస్తాయి,అదరగొడతాయి
నా మనసును హింసిస్తాయి.వేదిస్తాయి వెంటాడతాయి,కసితీర్చుకుంటాయి
నీ ఆలోచనలు మనసులో గుబులు రేపుతాయి ..గుర్తులు గుండెల్లో దడపుట్టిస్తాయి
ఒకటి మాత్రం నిజం నీవు లేని నేను లేను అని..నీ ఆలోచనలే నా ఊపిరి..
ఒక చోట ఒంటరిగా కూర్చున్న నీ ఆలోచనలు నీ జ్ఞాపకాలు
నన్ను మొత్తం కమ్ముకుంటాయి. నీవే నా లోకం నీవే నా జీవితం..
నీవు లేని నేను లేను..అంతలా నా మనసును దోచావు ప్రియా..