Monday, March 7, 2011
ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి..కారణం నీవే
ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి..కారణం నీవే..
ఆలోచించకు అని నీవంటావు..అంత ఈజీ కాదని నీకు తెల్సు నాకు తెల్సు
మదురస్ముతులు మరుపును దరిచేరనీయడంలేదు ..
నీ తలపులు గుర్తుకురాగానే ..కన్నీళ్ళు ఆగనంటున్నాయి..
నీగుర్తులు గుండెళ్ళో గుబులు రేపుతున్నాయి..
చీకటి పడిందటే నీ తలపులు మనసుపొరళ్ళోనుంచి బయటకు వస్తున్నాయి..
నన్ను నన్నుగా ఉండనీయకుండా నీ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చి వేదిస్తున్నాయి..
నీవంటూ లేకుంటే నీనిప్పుడూ లేనన్న నిజం...కారణం చెప్పమని వేదిస్తున్నాయి...
ఒక్కసారి కూడా నే గుర్తురానా..ఇక నీవు నన్ను ఎప్పటికీ చూడలేని రోజొస్తుంది..
గాయం పెద్దదవుతుంది రోజురోజుకి అదే నా ఆఖరి ఘడియను గుర్తుకు తెస్తుంది..
ఐనానీవు నన్ను మరచిపోతున్నావని మరచిపోయావని అనిపిస్తే మరణించాలనిపిస్తుంది
నువులేని రేపటిని తలచలేక నేటిని మరచి నిన్నటిలోనే నిదురోతున్నది నా మనసు....
నీవు నాతో లేవన్న నిజాన్ని నన్ను మర్చిపోయావన్న వాస్తవాన్ని తట్టుకోలేక మౌనంగా రోదిస్తున్నా..అంతకంటే ఏమి చేయలేక
Labels:
కవితలు