Saturday, March 26, 2011
ఇక నన్ను ఎప్పటికీ చూడలేవేమో ఇది నిజం
అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.
నీ ప్రేమకోసం నేను పడిన వేదన,
నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,
నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,
నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,
దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,
నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,
నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,
ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,
అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.
ఇక నన్ను ఎప్పటికీ చూడలేవేమో ఇది నిజం
ఎవ్వరికీ కనిపించాలని లేదు...కనిపించక పోయినా పోయేదేముంది కదా..?
శాశ్వతంగా ఎవ్వరికి కనిపించనత దురంగా వెలుతున్నా..?
మనుషులు స్నేహాలు,ప్రేమను అన్నీ నిజాలు కావు అన్ని భ్రమలే
బ్రమల్లో బ్రతకడం కంటే అన్నిటికీ దూరంగా వెల్లడమే మంచిది కదా..?