. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, March 25, 2011

స్నేహం ఎడారిలో ఒయాసిస్సు. నీవెంటే నడిచే నీడ




స్నేహం ఎడారిలో ఒయాసిస్సు. నీవెంటే నడిచే నీడ. నీ మనసులోని ఆనందాన్ని, అలజడులను తెలుపకనే తెలుసుకునే తోడు. సమస్యల సాగరంలో మునిగిపోయినపుడు చేయిపట్టి లాగే నేస్తం. నేనున్నానని ధైర్యాన్నిచ్చే వెలుగు. గెలుపులోని ఆనందాన్ని పంచుకునే సహచరి. ఓటమిలో వదలని హితుడు. ఎప్పుడూ అండగా నిలిచే ఆత్మీయుడు. అందుకే ప్రపంచంలోని అన్ని బంధాలలో స్నేహం తీయనిది అంటారు. కమ్మనిది అంటారు. సుఖంలో... బాధలో... ఆనందంలో... దు:ఖంలో... నవ్వినా... కన్నీరు కార్చినా... ఎప్పుడూ నీ వెంటే ఉండే స్నేహాన్ని మాటల్లో వర్ణించడం కష్టం..స్నేహితులంటే ఒకరినుండి ఒకరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఒకరి ఎదుగుదలకు మరొకరు చుక్కాని కావచ్చు. ఒకరి వికాసానికి ఒకరు చేదోడు కావచ్చు..స్నేహ మాధుర్యం అమూల్యం. అనన్యసామాన్యం. అంత గొప్ప స్నేహం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలంటే... దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరిదీ! దానికి తగ్గ కృషి ఉండాలి. పంతాలు, పట్టింపులకు అతీతంగా స్నేహం ఉండాలి. స్నేహితుల్లో లోపాలుండటం సహజం. మన వారు అనుకున్నప్పుడు లోపాలుంటే చెప్పడం తప్పుకాదు. ఇతరుల వద్ద చెప్పి స్నేహం విలువ తగ్గించేకంటే లోపాలు చెప్పి సరిదిద్దడం ఉత్తమం. ముందొక మాట, వెనుకొక మాట కన్నా ముక్కుసూటిగా మాట్లాడుకోవడం నిజమైన స్నేహితుల లక్షణం. వారు మన మేలు కోరేవారని అర్థం. అలా వారు విమర్శించినపుడు కోపం తెచ్చుకోకూడదు. స్నేహితులు అన్న పదంలోనే హితం ఉంది. అంటే, మన మేలు కోరేవారన్నమాట! అలాంటివారు మీలోని తప్పును ఎత్తి చూపినపుడు దానికి కోపం తెచ్చుకోకుండా అందులో నిజమెంతని ఆలోచించుకోవాలి. కాకుంటే విమర్శ సున్నితంగా ఉండాలని గుర్తుంచుకోండి..అలాగే పొరపాట్లు జరగడమూ సహజమే. అలాంటప్పుడు ఒప్పుకోవాలి తప్ప దబాయిస్తే ఫలితం ఉండదు. ఎందుకంటే స్నేహంలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్న ప్రశ్నే ఉండకూడదు. తప్పు ఒప్పుకోవడంవల్ల స్థాయి, స్థానం దిగజారేది ఉండదు...మనసు నొప్పించే పనులకు స్నేహంలో తావియ్యకూడదు. స్నేహితుల మనస్తత్వంపట్ల ఒక అవగాహన ఉంటుంది. కనుక చిరాకులో వాళ్లొక మాటన్నా అలా ఎందుకన్నారోనని ఆలోచించాలి. ఉద్రేకాలకు తావియ్యక సంయమనం పాటించాలి. వారి పరిస్థితిని అర్థంచేసుకోవాలి. పిలిచిన వెంటనే రాలేదనో, ఫోన్‌ ఎత్తలేదనో కోపం తెచ్చుకోకూడదు అవతలి వాళ్ళు ఏపరిస్థితుల్లో ఉన్నారో అర్దం చేసుకోవాలి..ప్రతి వ్యక్తిలోనూ తనదైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. స్నేహితులు వాటిని ప్రోత్సహించాలి. పెంచి పోషించాలి. వారికి తగిన సహాయ సహకారాలు అందించాలి. వారి విజయం తమ విజయంగా భావించాలి