Friday, March 25, 2011
ఎక్కడో ఏదో జరుగుతోంది...తెలియని ఆందోళన
ఎక్కడో ఏదో జరుగుతోంది...తెలియని ఆందోళన..
ఊహకందని ఆలోచనలు పిచ్చెక్కిస్తున్నాయి..
ఎవరు నీవంటూ ప్రశ్నిస్తున్నాయి..
మనిషి మనసులోలేనప్పుడు మాటలు పెదాలు దాటవుకదా..
గెలవాలన్న ఆరాటంలో దిగజారుతున్న గెలుపు..
ఎప్పటికీ గెలవలేవంటూ వెక్కిరిస్తున్న ఓటమి
ఈ నిషా రాత్రి..చీకటి శాశ్వితం అయితే బాగుంఅనిపిస్తోంది..
వెలుగులు చూడాలని లేదు..అంతా చీకటే కావాలనిపిస్తుంది..
వెన్నెల కుడా వేడిగా అనిపిస్తోంది భరించలేనంతగా..?
కొందరు చాలా అద్రుష్టవంతులు వెన్నెలను ఆస్వాదిస్తారు..
ఈ వేడి వెన్నెల నాకు మాత్రమే అందరికి కాదుకదా..?
వెన్నేలే ఇంత వేడిగా ఉంటే ఇక సూర్యుని వేడి ఎలా తట్టుకో గలను కదా..?
వద్దు చీకటే కావాలీ ఆ చీకటే శాశ్వితంకావాలి వెలుగు అస్సలు వద్దు..
Labels:
కవితలు