నేనేవరకీ అర్ధం కాను ...ఎందుకు అర్దకావాలి..? ఎవరికోసం..?
నేనేంటో నాకు నేనే అర్దకాలేదు మరి మీకు ఎలా అర్దంఅవుతాను..
గుండె లోతుల్లో ప్రతిధ్వనించే అగ్నిగుండాలు..ఆవిర్లుగా కన్నీరై బైటికొస్తున్నాయి
నాటి తీయని పిలుపులు ..ఇప్పుడేదంటూ గుండె ప్రశ్నిస్తోంది..?
జ్ఞాపకాల దోంతరలో కదిలే నీలి నీడలు..బయంకరంగా వెంటాడుతున్నయి
గతం మిగిల్చిన విషాదం గుండెల్లొ గుచ్చుతుంటే ఊపిరి నిలవనంటుంది..
గుండెల్లొ నీ గుర్తులు రక్తకన్నీరు కారుస్తుంది నీవెక్కడ అంటూ
నీవులేని ప్రపంచం నాకువద్దు అందుకే ఎవ్వరూ లేని ప్రపంచంకావాలి
నీ నవ్వులు నావికానప్పుడు..నీవే నాకు దూరం అయినప్పుడు..నేనెందుకు..