జ్ఞాపకాలు మధురం గాయాలు విస్మయం
వెనుదిరగకు నావైపు చూడకు అది జ్ఞాపకమైనా విస్మయమైనా
నీ కళ్ళ ముందుంది దివ్య కాంతి ..నీవు చూసేది బ్రమ మాత్రమే,
నీకు కనిపించే నిరాశావాదిని.
నేనొక ఒంటరిని,
నీకు కనిపించే మనిషి ఇప్పుడు లేడు.
నేనొక అగ్నిశిఖని,
మీకు కనిపించే ఆరిన భస్మాన్ని.
నేనొక రగిలేఅగ్నిజ్వాలని,
ఓ నిశ్శబ్దపు ప్రపంచానికి.
నేనొక సమరాన్ని,
యుద్ధం తెలియని నీ మనసుకి.
నాకు నేనొక విరహాన్ని,
నివు లేని నా జీవితంలో ఒంటరిగా మిగిలి
మీరనుకునే ఓ భగ్న ప్రేమికున్ని.
నేనొక స్వార్థాన్ని,మన అనలేక నాలోనేనున్నాను
నీ నుండి నేను అనుకునే భావానికి.......
రగిలిపోతున్న ఓ చితి బస్మాన్ని..?.