Sunday, March 13, 2011
అంతాచీకటి....వెలుతు వచ్చేఅవకాశం లేనంత చీకటి
అంతాచీకటి....వెలుతు వచ్చేఅవకాశం లేనంత చీకటి..
జీవితం అంతే వెలుగు చీకట్లు..మరి కొందరి చీకటే జివితం అవుతుంది..
వెలుగులకోసం ఎదురు చూసినా...వచ్చే అవకాశంలేనప్పుడు..
ఎప్పుడూ కాంతులు వెదజల్లే చందమామకే తిప్పలు తప్పవు మనమెంత
చల్లటి వెన్నెల కాంతులు వెదజల్లుతూ..
ఆరుబైట ఆకాశంకేసి చూస్తే కనిపించే నిండు చంద్రుడే మసకబారాడు..
చీకట్లు కమ్ముకున్నాయి..ఆచీకట్లు వీడనంటున్నాయి..
రాకాసి మబ్బులు..తెల్లటి అందమైన చందమామను కమ్మేశాయి..
ఆనల్లటి మేఘాల మద్యి చల్లని చందమామ ఆశగా ఎదురు చూస్తున్నాడు..
తనను కమ్మేసిన నల్లటి రాకాసి మబ్బులనుంచి కాపాడమని ..దీనంగా..
ఎవ్వరూ రక్షించలేనంత దూరంగా ఉన్న ఆచల్లని చంద్రున్ని ఎవ్వరు రక్షించాలి..
రక్షించిగలిగిన వాళ్ళు రక్షించేవాళ్ళు చంద్రున్ని వీడి దూరంఅయ్యారు..
ఇక చంద్రున్ని ఎవ్వరూ రక్షించలేరు..రక్షించలేనంతగా కమ్మేశాయి రాక్షస మబ్బులు
చూడండి ఎంత దినంగా ఉన్నాడు మబ్బులు గమ్మిన చంద్రుడు..
మనకిక ఈమాత్రం కుడా చంద్రుగు కనిపించడు ..కనుమరుగైపోతున్నాడు ఇది నిజం
మన చేతులారా మనమే ఆ చంద్రున్ని దూరం చేసుకుంటున్నాం..దూరమైతేకాని ఆ చంద్రుడి విలువ తెలీదు కదా.....?
Labels:
కవితలు