Wednesday, March 23, 2011
తెల్లటి వెలుతురులో అందాలు చిందుతూనీవు మెరిసే తారకలా
అరచేతుల నిండా వెన్నెలను పట్టుకున్నాను
సముద్రాన్ని ఆశిస్తూ ఒక చల్లటి వర్షాన్ని వెదుకుతూ
వచ్చాను నీ వద్దకి వంచిన నీ తలని ఎత్తగా
మెరిసాయి అక్కడ తెల్లటి వెలుతురులో
అందాలు చిందుతూనీవు మెరిసే తారకలా
అది కల కళ్ళు తెరచి చూస్తే నీవు లేవు
అది అబద్దం అని తెల్సి నిదురలేని రాత్రుల్లు గడిపా
ఏంటో ఏది నిజం కాకూడదనుకుంటాను
అవే నిజాలవుతున్నాయి
అందుకే ఒక్కోసారి నామీద నాకే జాలి వేస్తుంది..
అప్పూడూ అనిపిస్తుంది నామీదనాకే చిరాకు..
ఎందుకంటే..నీవు రెండూ చూపించవు కాబట్టి..
ఆ రెండూ ఫీలింగ్స్ నాకే కలుగుతాయి చండాలంగా..
నీవు లేని నేను లేని నేను లేనేది వాస్తం..
ప్రతిక్షనం నీ జ్ఞాపకాను నన్ను వేదిస్తున్నాయి అన్నది వాస్తవం
Labels:
కవితలు