Saturday, March 26, 2011
అందరూ నన్నే ఎందుకు అంటారు..మంచి చేసిన చెడు అవుతోంది
అందరూ నన్నే ఎందుకు అంటారు..మంచి చేసిన చెడు అవుతోంది
అందుకే నేను తీసుకున్న నిర్నయమే కరెక్టు..చావు ఘోష వినిపిస్తోంది
మరణం నాకు వరమే..నీ మాటలు కరువైన వేళలో నాకు నేను లేను
బ్రతుకు నాకు శాపమే...నీ పెదవులపై చిరునవ్వు మాయమైన క్షణంలో
ఏకాంతం నాకుఎప్పటికీ మిత్రుడే...నీ అడుగులు నన్ను విడిచిన వేళలో
నాకు ఎవ్వరూ శత్రువులు కాదు..నాకు నేనే పెద్ద శత్రువుని ఎప్పటికీ
ఒకరికి ఒకరు ప్రాణంగా ఎలా ఉంటారు..అందరూ నమ్మేట్టుగా..
అవన్నీ నిజాలేనా ..అందరికీ మంచి జరుగుతుంది నాకు తప్ప..?
కొందరు మోసపోవడానికే పుడతారు..వాళ్ళ కలా రాసిపెట్టు ఉంటుందేమో
ఎన్నని తట్టుకోగలను ఎన్నిసార్లని భరించగలను అన్ని విషయాల్లో రివర్సే..
ప్రతిక్షనం జరిగే అన్ని విషయాలు భరించలేనట్టున్నాయి ఇక నా వల్ల కాదు..
Labels:
కవితలు