Friday, March 11, 2011
గతమొక చేదు అనుభవం....ప్రస్తుతం భయంకర స్వప్నం
గతమొక చేదు అనుభవం....ప్రస్తుతం భయంకర స్వప్నం
నీవు దూరం అయినప్పటి నుంచి ..మనసులో అలజడుల సంకేతాలివి
జరుగుతున్నవి ఎంత నిజాలు కావనుకున్నా..నిజం వాస్తం ఎందుకు కాదు
ఇలా ప్రతిక్షనం నాలో జరుగుతున్న మానసిక ఘర్షన..తట్టుకోలేక పోతున్నా
ఒకప్పటి నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను..బ్రతికున్న శవంలా మారా..
గతంతాలూకా భాదలు మరిచిపోలేక..ప్రస్తుతాన్ని జీర్నింకోలేక మదన పడుతున్నా..
నాలో మనిషిని పూర్తిగా కోల్పోయా..అంతలా ఏమార్చి మార్చావు నన్ను
అసలు ఒక్కసారి అన్నా గుర్తుకురానా అనిపిస్తుంది..ఆ అవసరం నీకెందుకుంటుంది లేకదా..
ఇలాంటి పొంతనలేని గజిబిని ఆలోచనలతో...గుండెల్లో చెలరేగుతున్న మంటలు..
ప్రతిక్షనం ప్రతినిమిషం నీ ఆలోచనలతోగుండే ఆగేంతగా..ఆ రోజుకోసం ఎదురు చూస్తూ
Labels:
కవితలు