Sunday, March 6, 2011
నా మనసు పదే పదే నీవెక్కడ అని ప్రశ్నిస్తుంది,
ఏమని సమాధానం చెప్పను,
నా మనసు పదే పదే నీవెక్కడ అని ప్రశ్నిస్తుంది,
ఎప్పుడూ నీతో నడిచే నీడ (నీవే ) ఏమయిందని,
నన్ను సాయంసంధ్యవేళ అస్తమించే సూర్యుడు అడిగాడు,
నీ నీతో ఉండే వెన్నెల కనిపించటంలేదేంటని,
నిన్ను ప్రతిక్షనం వెతికే నా కళ్ళు నన్నుఅడిగాయి,
నీతో ఎప్పుడు నడచి వచ్చే అందాల బొమ్మ ఏదని..?
మండు టెండలో నడుస్తున్నప్పుడు నా నీడ అడిగింది
ఎప్పుడూ నీతో నడిచిన తొడు ఏమయిందని?
ఏమని సమాధానం చెప్పను వాటికి,
కంటినీండా కన్నీరు కానుకగా వదిలి తను వెళ్ళిపొయిందనా?
గుండెలొ మంటలు రాజేసి ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయిందని చెప్పనా.?
మూగబొయిన మనసులో మాటలు మాయమయ్యాయి.
నీవు నాకు దూరం అయిన క్షనంనుంచి నాలో నేను లేను..
అన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం అయ్యింది.
Labels:
కవితలు