Thursday, March 10, 2011
మనస్సులో ప్రతిక్షణం..మెదిలాడుతున్న నీజ్ఞాపకాలు
మనస్సులో ప్రతిక్షణం..మెదిలాడుతున్న నీజ్ఞాపకాలు
మనసులో నీ తలపులు..నిదుర పట్ట నీయడంలేదు
నిన్నటిని మరువలేక ..నీవులేని రేపటిని ఉహించలేక
నన్ను నీజ్ఞాపకాలు..నిదుర పట్ట నీయడంలేదు
జీవితంలో ఓటమి అంటూ ఏమి ఎరుగని నేను..
నీ విషయంలో దారుణంగా ఓడిపోయాను
కలలు జీవితంపై కాంక్ష పెంచుతున్న
యధార్ధాలునన్నుచూసి నవ్వుతున్నా
నీవు లేని నేను లేను అన్న నిజాన్ని
జీర్నీచుకోలేకపొతున్నా
నీ కోసం నీకోసం చేసే ప్రతిప్రయత్నం
విషాదాన్నే మిగులుస్తుంది ...
నీవు కావాలనుకున్న ఎదురుచూసిన ప్రతిసారి
అవమానం ఎదురవుతుంటే ...
నీవు లేని రోజు కోసం ఎదురుచూసే ఓపిక నాకికలేదు
కన్నులు మూస్తే వచ్చే చీకటే నయమని ...
నీవు ప్రతిక్షనం నవ్వుతూ ఉండాలి నేస్తం
మరణిస్తున్నాను నేస్తం..మన్నించు నేస్తం
Labels:
కవితలు