Tuesday, March 15, 2011
అలలా వచ్చావు ..కలలా ఎందుకు మిగిలి పోయావు ప్రియా
అలలా వచ్చావు ..కలలా ఎందుకు మిగిలి పోయావు ప్రియా..
ప్రతిక్షనం నీ తలపులతో పిచ్చివాడిలా ఆలోచిస్తున్నా.
ఒకప్పుడు నన్ను గాజు అద్దంలా చూసుకున్నావు..
అలా చేతిలో ఉన్న గాజును ఒక్కసారి వదలి వేస్తే పగిలిపోతుంది కదా
మళ్ళీ అతికే అవకాశంలేనంతగా.. ఇక మనిద్దరం కూడా అంతేనా..
ఎప్పటికీ ఇలాగే విడిపోయి ఉంటామా..ఎప్పటికీ కలిసే అవకాశమే లేదా...?
ఈ ఆలోచన వచ్చినప్పుడు ఆ క్షణం గుండె ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది..
జీవితంలో నా మనస్తత్వం తెల్సుకున్న మొట్టమొదతి వ్వక్తివి నీవు..
నన్ను చిన్నమాట అనకుండా ఎంత స్నేహంగా చూసుకున్నావు నన్ను....?
ఇప్పుడు బద్ద శత్రువుల్లా ఎందుకున్నామో అని తలచకుంటే కంట కన్నీరు ఆగదు..
ఇలా నీవు గుర్తుకు వచ్చిన ప్రతిసారి గుండెల్లో చెప్పలేనంత భాద..
అంతే అంతకంటే ఏమి చేయలేను..భారంగా గుండెల్లో నిన్ను తలచుకొంటూ ఉండటం తప్ప
ఇలా నీగురించి ఆలోచించి ఆలోచించి గుండే ఖచ్చితంగా గుండె ఎప్పుడో ఆగిపోతుంది..
నా ఊపితి ఆగేలోపు నీతో చాలా చాలా చాలా చాలా మాట్లాడాలని ఉంది కాని అది సాద్యింకాదేమో
గతం ఎంతో హాయిగా ఉంది అదే నాజీవితం అనుకున్నా అదే గతం నన్ను వెర్రివాడాని వెక్కిరిస్తుంది..
గతం తాలూకా జ్ఞాపకాలు నన్ను ప్రతిక్షనం నన్ను శత్రువుల్లా వెంటాడుతున్నాయి..
ఒకప్పుడు నేను వేరు ..ఇప్పటి నేను వేరు..నాలో నేను ఎప్పుడో చచ్చిపోయాను.
బ్రతకలేనంతగా చచ్చిపోయాను...నీవు లేని నేను లేనని నీకు తెల్సు అయినా నీవు..?
..వద్దు ఆలోచించవద్దు నాలాంటి వాడీ గురించి అస్సలు ఆలోచించవద్దు ..Be Happy Dear
Labels:
కవితలు