Friday, March 18, 2011
నాలోనేను..అంతర్ముఖం (తెల్సుకోవాలని ఉందా )
నాలోనేను..అంతర్ముఖం (తెల్సుకోవాలని ఉందా )..( అందుకే నేనెవ్వరికి అర్దంకాను అర్దం చేసుకోవాలని ప్రయత్నించకు)
జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి..కొన్ని మనకు నచ్చినట్టు మరికొన్ని మనల్సి ఇబ్బది పడేట్టు చేస్తాయి..అలాగని అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే దానిని లైఫ్ అనరు..ప్రతి మనిషిలో ఇద్దరు వ్యక్తులుంటారు..ఒకడు బయటికి కనిపించేవాడు మరొకడు కనిపించడు..వాడినే మనం అంతరాత్మ అంటాం..లోపలి వాడు చెప్పే వాటినే బయటి వాడు చేస్తుంటాడు..నీకు ఓ వ్యక్తి బాగానచ్చింది..ఇద్దరూ స్నేహితులైయ్యారు...ఇద్దరికి మద్యి కుదిరిన ఆస్నేహం ఎన్నోవిషయాల్లో అండగా అనిపించింది..తనతో మాట్లాడిన ప్రతిసారి ఎంతో హాయిగా అనిపించేది అనుకోకుండా ఇద్దరి మద్యి మరో వ్యక్తి ప్రవేసించడం విడిపోవడం జరిగింది అవును కొందరి జీవితాల్లొ విధి అలా ఆడుకొంటుంది..అది మద్యిలో వచ్చిన ఆవ్యక్తి తప్పుకాదు నమ్మిన వ్యక్తి తప్పుకాదు it will happen మళ్ళీ కలవలేనంతగా ఇద్దరి మద్యి అఘాదం ఏర్పడింది మాటలు కరువయ్యాయి...కనీసం ఎదురుపడి చూసుకునే అవకాశం లేకుండా పోయింది తప్పెవరిది అని నిందించుకొంటూ అటు వైపు మనిషి మీద కోపం పెంచుకోని మోసం చేసిందని ఆత్మవంచన చేసుకొని మనలోపలి మనిషిని మనలోని ఇగోని సాటిస్ ఫైచేసుకుంటాం...అటు వైపు ఉన్న అమే ఏపరిస్థితుల్లో ఉంది..ఆ పరిస్థితులు అలా నమ్మేలా చేసి ఉండొచ్చుకదా అని మాత్రం ఆలో చించం..ఎందుకంటే ఎప్పుడు మనమే కరెక్టు అని మనగురించే ఆలోచిస్తాం కనుక మన ఎవ్వరిని అయినా ఇష్టపడగానే అంతగా జీవితంలో ఎవరిని ఇష్టపడలేనంతగా...అమె పేరు మన ఈమైల్ పాస్వార్డ్ గా మారుతుంది..మనం పెట్టే సంతకంలో కూడా అమె పేరులోని మొదటి అక్షరం చేరిపోతుంది ఆమెను ప్రతిక్షనం గుర్తుకు తెచ్చుకునేందుకు ఇలాసేస్తాం ....జీవితంలో మనసుకు నచ్చేది ఒక్కరే ఈ ప్రయాణలో ఎందరో వచ్చి చేరినా అవ్యక్తి ని మాత్రం మరువలేం జీవితాంతం ...అలాంటి వ్యక్తి జీవితంలో పరిచయం ఉండేది కొన్నాల్లే...కాని జీవితానికి సరిపడా అనుబందం ఏర్పడుతుంది నేనేప్పుడు నావైపు మాత్రమే కాకుండా రెండువైపులా ఆలోచిస్తాను ఇలా ఆలోచించడంవల్ల ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదురౌతాయి అవుతున్నాయి అవతలి వారి మనస్సు చదివే అవకాశం దొరుకుతుంది..అది మన మనస్సుకు నచ్చక పోవచ్చు నిజాలు తెలుస్తాయి..మనం మెచ్చేది మనకు నచ్చేది నిజం అనుకుంటే పొరపాటు మనకు నచ్చనివి కూడా ఉంటాయి...అలాంటప్పుడు భాద వేస్తుంది భాదపడు అంతకు మీంచి ఏమీ చేయలేంకదా వీలుంటే అవతలి వ్యక్తి మనస్సు గెలుసుకునే ప్రయత్నం చేయి లేకుంటే అమె సంతోషంగా ఉందాలి అనికోరుకో చెప్పటం ఈజీనే కాని ఆచరణ మాత్రం కష్టమే (ఇంకా ఉంది ) ( ఏంటి ఈ సోది అనుకుంటున్నారుకదా..?..)
Labels:
జరిగిన కధలు