Thursday, March 24, 2011
కలలు కన్నీటిలో కరిగిపోతే..గుర్తులు గుండెల్లో పదిలంగా ఉన్నాయి
కలలు కన్నీటిలో కరిగిపోతే..గుర్తులు గుండెల్లో పదిలంగా ఉన్నాయి..
కలలు ఊహలు మాత్రం అవి ఎప్పటికీ నిజాలు కావు అవకాశం లేదు...
నిషారాత్రులు జ్ఞాపకాల దోతరలు కదిపినప్పుడు..మెదిలేభావాలు..
కలలు గా వచ్చి కన్నీరు తెప్పిస్తాయి..అవి నిజాలు కావని తెల్సినా
కొన్ని సార్లు జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు వచ్చినా అవే కలల్లో వస్తాయి..
అన్నీ మర్చిపొయి నిద్రపొవాలనుకున్నా ఈ కలలు నిద్దురలో వేదిస్తాయి..
వెంటాడే మన పాత జ్ఞాపకాలే..అయినా గుండెళ్ళో భాదగా ఉంటాయి..
మనిషికి మనసుకు మద్యి ఘర్షన తాలుక జ్ఞాపకాలే ఇవి ..
పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ భాద తప్పదు కదా..?
మనిషికి మనసుకు అంతరం పెరిగినప్పుడు ఈ భాద తప్పదు కదా..
Labels:
కవితలు