Monday, March 28, 2011
గెలుపుకోసం ఆరాటపడి ఉపయోగంలేదు..నా ఈ ఓటమి శాశ్వితం..
ఎందుకిలా జరుగుతోంది అర్దంకావడంలేదు..?
మనసులో అలజడుల హారు తట్టుకోలేకపోతున్నా..
గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు జరుగ బోయేది చెబుతున్నాయి...
ఇక నాగుండె భరించలేదు....ఆలోచనలు ఆగకున్నా..
నాకు నేనుగా ఓడిపోతూనే ఉన్నా ...గెలవలేనంతగా ఓడిపోయాను..
గెలుపుకోసం ఆరాటపడి ఉపయోగంలేదు..నా ఈ ఓటమి శాశ్వితం..
వేదనల మద్యిలో వాదనలెందుకు జరగాల్సింది ఎప్పుడో జరిగి పోయింది..
అసలు నేనంటూ లేకపోతే ఆనే ఆలోచనే ఆనందంగా ఉంది
నాకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం తెలుసు..
ఊపిరికంటే ఎక్కువగా ఇష్టపడటం తెలుసు..ఇన్నీ తెల్సి సాదించిది ఏమీలేదు
సూన్యిం అనితెల్సి అక్కడి చుక్కల్ని అందుకోవాలనే పిచ్చి ప్రయత్నం ..?
గుర్తుకొచ్చిన ప్రతిసారి..కన్నీరు పెట్టుకోవడం భాదపడటం తప్పించి నాకేం తెలీదు..
నాకు తెల్సు నాకన్నీటికి విలువలేదని...నా స్నేహానికి కూడా.. అందుకే కదా ఇలా..?
నీలో నేను లేనన్న వాస్తవం నిజం అయినా ఎందుకీ తపన తెలియని ఆవేదన..
తలచుకొన్న ప్రతి సారి తడి కన్నుల ఆరాటం తప్ప ఆ కన్నీటికి విలువ లేదని...
ఎంత కాదనుకున్నా జరిగింది ..జరుగుతోంది అన్నీ నిజాలే నీలో నేను లేననది కూడా వాస్తవమా..?
మనిషిగా ఎప్పుడూ చచ్చిపోయాను..మనస్సులేని మనిషిగా మిగీపోయాను..ఎందుకిలా..?
దేనికీ సమాదానంలేదు..ఆలోచించి ఆలోచించి మనస్సు నీరస పడిపోయింది..ఎన్నాళ్ళీలా..?
Labels:
కవితలు