Monday, March 7, 2011
నిజాన్ని నిలదీయాలని ఉంది...ఆపని ఎందుకు చేయలేకపోతున్నా
నిజాన్ని నిలదీయాలని ఉంది...ఆపని ఎందుకు చేయలేకపోతున్నా.
కారణం తెలీదు...నిజాలన్నీ అబద్దాలు ఎందుకు అవుతున్నాయి..
కన్నీటి కడలిలో ఈదుతున్న నేను తీరం చేరేలా లేను ...
కడలిలో నన్ను కబలించేందుకు వస్తున్న మొసళ్ళు..
తీరానికి చేరుతానన్న నమ్మకంలేదు..అందుకే నిజంపై నమ్మకంపోయింది..
సూర్యుడు కూడా కన్నెర్రజేసి..తన ప్రతాపం అంతా నామీద చూపిస్తున్నాడు..
చివరకు రాత్రిళ్ళు వచ్చే చంద్రుడు..కూడా ఎంతో వేడిగానే అనిపిస్తున్నాడు..
పగలు రాత్రి తో సహా అందరు ఎందుకు కక్షకట్టారో తెలిదు..
మరి నీవు అలా మౌనంగా ఉంటే ఎలా..ప్రియా..
అందరూ తో పాటు నీవు మౌనంతోనే చంపేయాలనే చూస్తున్నావా..
ఎదైనా బరించగలను గాని నీమౌనాన్ని బరించలేకున్నా..
నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు నీవున్నావన్న ఆ కాస్త దైర్యం పోతోంది..
అందరూ ఇలా కక్షకట్టి....నన్ను కానరాకుండా చేయాలని చూస్తున్నారు..
నన్ను నేను గా కోల్పోయిన నన్ను ...ఎంచేయాలనుకుంటున్నావు...?
Labels:
కవితలు