Monday, March 14, 2011
నేనల్లుకున్న పొదరిల్లు చెదిరిపోయింది..ముళ్లు విరిగి నాగుండెల్లొ గుచ్చుకుంది
సరిగ్గా రెండు నెలల క్రితం
హఠాత్తుగా వీచిన సుడిగాలి
మనసులో కురిసిన జడివానకు...
నేనల్లుకున్న పొదరిల్లు చెదిరిపోయింది
ముళ్లు విరిగి నాగుండెల్లొ గుచ్చుకుంది
రెక్కలు విరిగిన పక్షిలా నేల కూలాను...
విషపు ముల్లేదో గుచ్చి
మనసు పచ్చి పుండయ్యింది
అప్పుడప్పుడు కాలం కరుగుతోంది
కానీ జ్ఞాపకాలు ఘనీభవించడం లేదు
కాలి గుర్తులను చెరిపే అలల్లా
కాలం నా గుండె గాయాలను చెరపలేకపోతోంది
కలసి నడిచిన దారుల్లో
ఎండిన చెట్టుకి రాలిన ఆకుల్లా
ఒక్కో జ్ఞాపకాన్ని ఏరుకొని
గుండెపొరళ్లో నెమరు వేసుకుని
ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్నా...
బ్రతికి ఉంటానో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నా
kavitha GARU "http://sreevasini.blogspot.com
Labels:
కవితలు