అమావాశ్య రాతిరిలో వెన్నెల వై వచ్చావు,
నడిరేయి జాములోకి వేకువలా వచ్చావు
ఆశలేని జీవితాన అందమైన స్వప్నమా
రంగు లేని మనసులోకి హరివిల్లు వై వచ్చావు
రాగం లేని బ్రతుకున అనురాగమే దిద్దావు
యడారి వంటి మనసున తొలి చినుకువై కురిశావు,
అర్థరహిత జీవితాన అందమైన భావమా
అందనంత దూరానికి స్వర్గమే తెచ్చావు
తడి ఆరిన పెదవులని అమృతమై తడిపావు
నీరెరుగని యేరులోకి గంగవలే వచ్చావు
శిశిరంలో వసంతమా, నా యెదలోని రాగమా
పదం లేని పాటలోకి పల్లవివై వచ్చావు