ఊహల్లొ విహరించే ఆశాసౌదం కూలిపోతోందా..?
నిర్లిప్తంగా మూసుకున్న కనురెప్పల్ని తెరవ కూడదనే అనుకున్నా..
కళ్ళు తెరచి చూస్తే అద్బుత సౌందర్యం ..నిద్దరపట్టనీయదని...
కళ్ళలో మెరుపులు ...చిరునవ్వుల జల్లులో తడచి ముద్దౌతున్న క్షణాన..
ఎమౌతుందో తెలియదు..ఏమైందో తెలియదు..ఒక్కసారి ఆద్రంగా మూసుకొని తెరచి చుస్తే..
చుట్టూ చిమ్మచీకటి...ఆ మెరుపులు..ఆ కాంతులు...ఆ చిరుజల్లుల జాడే లేకుండా పోయింది..
ఎందుకూ ఆ క్షణాన కళ్ళు మూసుకున్నానా అని ఎన్ని సార్లు అనుకున్నా ఆ వసంతం తిరిగి వచ్చేనా..?
ఇప్పుడు కమ్ముకున్న చిమ్మ చికట్లు తొలగేనా..?
కలలు కల్లలైన వేళ అది నిజం అవుతుందా...జరిగింది నిజమా కలనా అనే బ్రమలే ఇంకా వీడిపోలేదు..?