Friday, January 7, 2011
నీవు గుర్తుకొస్తే నా కళ్ళు ఇలా వర్షిస్తాయి!
మబ్బులా కమ్ముకుంటాయి...
ఏకధాటిగా కురుస్తాయి...
నదీ ప్రవాహంలా ప్రవహిస్తాయి...
తడిసిన మల్లెలౌతాయి...
జ్ఞాపకాలన్ని గుర్తుకొస్తాయి...
నీవు గుర్తుకొస్తే నా కళ్ళు ఇలా వర్షిస్తాయి!
కంటి నిండా కలలున్నాయి...
అవి ఎప్పటికి తీరుతాయి...
గొంతులోని మాటలు పెదవి దాటనంటున్నాయి...
చేతులు చిత్రాన్ని గీయాలని ప్రయత్నిస్తున్నాయి...
కుంచె ఉంది, రంగులూ ఉన్నాయి...
నీ చిత్రాన్ని గీయాలంటే కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...
నా గుండెను రాతి బండను చేయి...
పగిలి పోయిందనుకో ఆ రాయి...
నన్ను మట్టిలో కలిపి వేసేయి...
తెల్సిన వారెవరెవరో చస్తాను అంటే తట్టుకోలేదు ...
నేను అదే మాట నేను అంటే మాత్రం తొందరగా అపని చెసెయ్ అంటోంది నా స్నేహితురాలు
పీడా వదులుద్ది అనుకుంటుంది మనస్సులో
భగవంతుడా! నీవు నాకు ఈ ఒక్క సహాయము చేయి
నాకు జీవించాలని లేదు ఏదోరూపంలో నాప్రాణాన్ని తిసేయ్ దేవుడా..
నా ప్రియసఖికి చివరి చూపుదక్కేల చూడు దేవుడా..
ఎందుకంటే నా చావు అమెకు ఆనందాన్నిస్తుంది అందుకే అది నాచిరరికోరికైంది