Wednesday, January 19, 2011
నిన్ను నిన్నుగా గౌరవించలేని వాళ్ళకోసం ఇవన్నీ అవసరమా..?
యెదలోని జ్వాల యెగిసిపడక ముందే
మది లోని మంట మాడ్చి వేయక ముందే
నాలోని శ్వాసా ఆగిపోకముందే
నాగతమంతా అనిచివేయక ముందే
నా ఆశలు నెరవేరక పోవా?
నా ప్రేరణ నిదురించకరదా ?
నేనే ఓ ప్రళయం కానా?
నా పాతస్నేహాన్ని తిరిగి సాదించుకోలేనా..?
ప్రతి క్షనం ఎందుకు నాకీ ఆవేదన..?
అవతలి వాళ్ళు కనీసం ఆలోచించనప్పుడు ఏంటీ ఆందోళన...?
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
ఎదుటి వాడు స్వార్దం చూపిస్తున్నాడు అని తెల్సి..?
....ఎందుకు మిన్నకుంటున్నావు..?
నిన్ను నీవు తక్కువ ఎందుకు చేసుకుంటున్నావు..?
నీవు ఎందుకు దోషిగా నిలబడతావు..?
నిన్ను నిన్నుగా గౌరవించలేని వాళ్ళకోసం ఇవన్నీ అవసరమా..?
చివరికి నిన్ను దారుణంగా విలువ లేకుండా మాట్లాడీనా..?
అవతలి వాళ్ళు ఇంకా నిన్ను దోషిని చేయాలని చూస్తున్నా ..?
ఏమి చేయలేని ..చేతకాని చవటలా ఎందుకు నిలబడ్డావు.?
అవతని వాళ్ళు సంతోషంగా ఉండాలని నీవేమి కోల్పోతున్నావో తెల్సా..?
నీవు చేసిన త్యాగానికి గుర్తింపు లేనప్పుడు అంతగా ఆలోచించాలా..?
Labels:
కవితలు