మట్టి పరిమళాన్ని కప్పుకొని
చైతన్య రహస్యాలను అద్దుకొని
రెప్పలు విప్పిన ఓ పువ్వు
జగతిని చూసింది
పంచ భూతాల రాగాలు
అణువణువునా
ప్రసార మౌతుండగా .......
ఒకవైపు
శూ న్యం లోంచి జాలువారిన
సజీవ దృశ్యాలను
తన స్మృతి పదంలోకి ఓంపుకొని
ఆనంద బీజాలుగా మార్చుతూ
మరో వైపు
కన్నీటి వర్షానికి తడిసి
కన్నీటి ధారలతో
తన పాదాలను తనే అభిషేకించుకొంటూ
జీవిత గమనంలో తెరలు తెరలుగా జాలువారిన
తీయని కలలను సెగలు సెగలుగా మనసుకు
పడిన గాయాలను శోకగీతాలుగా ఆలపిస్తూ
లయ సూత్రాన్ని పాటిస్తూ
ఓ పువ్వు నేల రాలింది .
ప్రాణం గాలిలో కల్సిపొయింది...ఎవ్వరూ కారణం కాదు పరిస్థ్తిలు