ఏమని బదులివ్వను ప్రియతమా....... ??
సముద్ర తీరాన న ఒంటరి పయనం
తాకే ప్రతి అల నీ జ్ఞాపకం
నా కాళ్ళను తడిమి నిన్ను గుర్తుచేస్తూ ఉంటే
నీవులేని నా ఒంటరి తనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే
ఏమని బదులివ్వను ప్రియతమా........ ??
వీచే చిరుగాలి న మేను ని తడుముతూ ఉంటే
నీ స్పర్స ను గుర్తుచేస్తుంటే
నీ తోడు ఏది అని ప్రస్నిస్తుంటే
ఏమని బదులివ్వను ప్రియతమా...... ??
నేను వేసే ప్రతి అడుగు
తన తోడును వెతుకుతూ ఉంటే
నీ తోడు ఏది అని ప్రస్నిస్తుంటే
ఏమని బదులివ్వను ప్రియతమా....... ??
మౌనం గా తల వొంచాను వాటి ప్రశ్నలకి
ఎప్పటికీ చెప్పలేనని తెల్సి..సమాధానం చెప్పలేక ..