Wednesday, January 26, 2011
ఈ ఆత్మఘోష ఎన్నాళ్ళు మిత్రమా ఊపిరి ఆగేదాకేగా
నా కన్నీటి బొట్టుని చదవటానికి
నీ వద్దకు వొస్తాను ఆర్తిగా
నువ్వు దాన్ని తీస్కొని చిరాగ్గా
విసిరేస్తావు నా మనసు మారుమూలల్లో కి
నీన్ను వెతుక్కుంటాను నా కళ్ళ మధ్య
ఇంకేమైనా నా ఆనవాలు దొరుకుతాయేమోనని
నీ నుంచి మరలిపోవాలనిపించదు ఎప్పటికీ..
నా జాడే అక్కరలేదంటూ నీవే దూరంగా జరుగుతున్నావు
మనమద్యి బందంలేనట్టు ఎలాఉండగల్గుతున్నావు
అది నీకు ఒక్కదానికే సాద్యిం ఎవ్వరివల్లాకాదు
ఈ ఆత్మఘోష ఎన్నాళ్ళు మిత్రమా ఊపిరి ఆగేదాకేగా
ఏంటో ప్రతిక్షనం నా మనసులో ఈ ఆవేదన
నీతో ఏతో మాట్లాడాలాని..ఏదో చెప్పాలని తపన
ఏన్నో నిజాలు నీకు చెప్పాలని నేనున్నా వినే స్థితిలో నీవు లేవు...
నీకోసం నేను ఎన్ని అవమానాలు భరించానో మౌనంగా
నీకు దూరమౌతున్నా కన్నీళ్ల అడుగుల్తో ఎవ్వరూ వెళ్ళని అనంత లోకాలకు..
Labels:
కవితలు