నీ పరిచయం పంచిన ఆనందం
అనుభూతులుగా మార్ఛి
గుండెల్లో దొంతర్లుగా పేర్చి
నా మది లో పదిలంగా దాచుకున్నాను
కాలం మన స్నేహాన్ని దూరం చెయ్యదు కదా?
ఈ కాలం మన అనుభూతులని మరుగుపరచదు కదా?
కలలు కన్న తీరాన్ని చేరుతూ
ఇక్కడి అనుబంధాన్ని మరువనని
మాటిస్తున్నాను నేస్తం... మరి...నువ్వు???
ఎంత పరుగులెట్టినా
తెలిసీ..ఎన్ని దారులు మారినా
అలసినప్పుడు నేను కోరే మజిలీ నీ జ్ఞాపకం
ఎంత దూరమెళ్ళినా
గతంపై ఎన్ని రంగులద్దినా
అప్పుడప్పుడు తరచి చూసే పేజీ మన స్నేహం
గతంలో ఆన్ని పేజీల్లో ఆనందం ఇప్పుడు కొత్తగా తిరగేసిన ప్రతి పేజీలో విషాదం..
గతం తాలూకా అనుభూతులు తిరిగి వచ్చేనా..?
మన మససు పొరల్లోదాగిన ..చీకటి ఎప్పటికి తొలగేను