నా హృదయంలో ప్రియా నీవు లేక
ప్రకృతి లోని సోయగాలు చిన్నబోయాయి
ఏ రేయి వెన్నెలా చల్లదనాన్ని ఇవ్వడం లేదు
సూర్యోదయమూ వెచ్చదనాన్ని ఇవ్వడం లేదు
ప్రతీ అందాన్నీ మనసుతీరా ఆనందించాలనే వుంది
కానీ ఎలా
నా మనసు నీ హృదయంలో కదా వున్నది .
నాతో భాదను పంచుకున్నవాళ్ళు
నాతో ఉండి నన్ను అర్దం చేసుకున్న వాళ్ళు
నన్ను నన్నుగా ఆరాదించి నేనేంటో పూర్తిగ తెల్సిన వాళ్ళు..
నా మరపురాని తీపి గుర్తులు పంచుకొన్న వాళ్ళు
నా ఆనందకరమైన రోజులు
పోయాయ్ అన్నీ పోయాయ్
జ్ఞాపకాలే మిగిలాయ్