రెక్కలు విప్పిన మనసును రెచ్చగొట్టాను
ప్రేమనె ఇంధనం నింపి పక్షిని చేశాను
ఆకాశానికి అర్రులు చాచాను
అందమైన భవితను అణగదొక్కాను
ఊహల లోకంలో ఊయలూగాను
ఈదురు గాలిలో ఊకనయ్యాను
ఆకశంలో తారననుకున్నాను
అనంతంలో బిందువయ్యను
కడలి సంగతి మరిచి పోయాను
కూపస్త మాండుకమై మిగిలిపోయాను
దిక్కులన్ని తిరిగి బిక్కపోయాను
దిక్కు తోచక నేడు మిగిలిపోయాను
కమ్మివేసిన మబ్బుల్ని తేల్చివేశాను
కన్నీటితో నేడు మిగిలిఉన్నాను