. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, January 16, 2011

అందరిలాంటి వ్యక్తిని కాదు నేను...?



అందరిలాంటి వ్యక్తిని కాదు నేను” అనుకుంటూ మనకిమనం ప్రత్యేకతను ఆపాదించుకోవడం ద్వారా మనం ఎంతో సంతృప్తిని మూటగట్టుకుంటుంటాం. ఇలా విభిన్నంగా ఉండాలన్న కోరికే ఒక రకంగా మన జీవితానికి జీవం కూడా పోస్తుందేమో! సామాజిక సంబంధాల్లో మనదైన ముద్రని స్థిరీకరించడానికి మనసు ఉవ్విళూరుతుంటుంది. అందుకే ఇంకొకరిని అనుకరించడం మనస్కరించదు. ఎన్నో అనుభవాల కలబోతగా విభిన్నమైన వ్యక్తిత్వం ఈపాటికే సంతరించుకోబడిన వ్యక్తుల గురించి కాదు ఇక్కడ ప్రస్తావిస్తున్నది! నూటికి తొంభైతొమ్మిది మనస్థత్వాలు మానసికంగానో, సామాజికంగానో, ఏదో ఒక పార్శ్యంలో ఓ గుర్తింపుని సంతరించుకోవడానికి తాపత్రయపడేవే. ఎక్కడి వరకో ఎందుకు అందరికన్నా భిన్నంగా రాయాలన్న చిన్న కాంక్ష లేకపోతే ఈ బ్లాగుని ప్రారంభించాలన్న పురుగు కూడా నా మనసుని తొలిచి ఉండేది కాదు. జన్మతః మనసులో “నేను ప్రత్యేకం” అనే భావం మేటవేసుకోపోయి ఉన్నట్లయితే.. జీవితాంతం మానసికంగానూ, సామాజికంగానూ మనుషుల్లో ఎదుగుదల కరువయ్యేదేమో! మనల్ని నడిపిస్తున్న అదృశ్యశక్తి ఇది. ఏ క్షణమైతే “నేను అందరిలాంటి వ్యక్తిని, లేదా అందరికన్నా తక్కువ వ్యక్తిని” అన్న భావన మన అహాన్ని సజీవంగా నిలుపుతున్న కాంక్షని కాలరాస్తూ మనసులో చొరబడుతుందో ఆ క్షణం నుండి బ్రతుకు అతి సాధారణమైపోతుంది. నాకు “అహం” లేదు అంటూ మనం చిలకపలుకులు పలుకుతుంటాం కానీ పరిమిత స్థాయిలో ఆ భావనే లేకపోతే అందరి జీవితాలు నిస్సారంగానే ఉంటాయి. అందరికన్నా బాగా చదవాలి, పిల్లల్ని మనదైన పద్ధతిలో పెంచాలి, మనం చేసే ఉద్యోగంలో మనదైన ముద్రవేయాలి.. ఇలాంటి ఆలోచనలు చేయకపోతే జీవితాలకు ఇప్పటి తళుకులు ఎక్కడి నుండి వచ్చేవి? అందరికన్నా భిన్నంగా ఉండాలన్నది కొందరిని పెడద్రోవలనూ తొక్కిస్తుంది. అలాంటి వారి ప్రస్తావనా ఇక్కడ అప్రస్తుతమే. జీవితాన్ని నడిపిస్తున్న ఆ “ప్రత్యేకవాదాన్ని” పదిలంగా కాపాడుకుందాం.