ఓపలేనంత బరువు
తట్టుకోలేనంత చీకటి
ఆపలేనంత పరుగు
చేరలేనంత దూరం
చెప్పలేనంత దిగులు
ఎటు చూసిన హేళనలు ,
అక్కర్లేని సానుభూతులు
మింగలేనంత చేదు అనుభవాలు
మొట్టమొదటి సారిగా నచ్చిన వ్యక్తి దూరం అవ్వడం
తరువాత హాలాహలం లాంటి గొడవలు
ఆందోళన వెల్లువ జారిపోతున్న మెట్లు
అఘాదాలు కూరుక పోతున్నా
ఎందుకు ఇలా జరుగుతుందో తెలియని ఆందోళన..
ఇష్టమైన వాళ్ళతో కనీసం మాట్లాడ లేని పరిస్థితి..
ప్రపంచం నాకు ఇష్టమైన వ్యక్తి నన్ను కాదనటం..
నాకు ఇష్టపడమే తెల్సు ..అభిమానించడమే తెల్సు..
గుండెలనీడా తన అలొచనలే