నాకు నచ్చిన మరో పాట...మనసు భాదగా అనిపించినప్పుడు గతంతాలూకా జ్ఞాపకాలు మనసులు కెలుకుతున్నప్పుడు...ఏమిచేయాలో అర్దకానప్పుడు మనసుకు నచ్చిన పాటలు వినటం నాకు ఇష్టం....అవికూడా అప్పటి ఘటనకు తగ్గట్టుగానే ఉంటాయి ఆజ్ఞాపకాల కోసమే ఆపాటలు వెతికి పెట్టుకోవడం నాకిష్టం..ఆ జ్ఞాపకాలతాలూకా మనుషులు బాగా గుర్తుకు వచ్చినప్పుడు ఆ పాటలు వెతుక్కొని మరీ వింటాను..మీరనుకోవచ్చు ఎవరి పిచ్చి వాడికానందం అంటే ఇదేనేమోకదా పక్కవాళ్ళని ఏవ్వరిని ఇబ్బంది పెట్టనంతవరకు..ok స్వతాహా నావళ్ళ ఎవరు ఇబ్బంది పడాలని చూడను ...నావళ్ళ ఎదుటి వాళ్ళు భాదపటతాను అన్నీప్పుడు నేనే అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతానూ అవుతూనే ఉన్నా ..ఈ కాంప్రమైజ్ అవ్వడంలో కుడా భాద ఉంటుంది కాని కొన్ని పరిస్థితుల్ల తప్పదుకదా..?అదే కొన్ని జీవితాలు ఇంతే అంటారు కదా అదీ ఇంతే మరి సరే నాసోది మీకెందుకు గాని..ఈ పాటలో మంచి ఫీల్ ఉంది మనసుకు నచ్చిన మనిషి పరిస్థితుల కారనంగా...ఊద్ద్యెశ్యపూరకంగా ఏమిచేయక పోయిన వదిలి వెళ్ళి అస్సలు నాతో మాట్లాడ వద్దు అని ఖచ్చితంగా చెప్పి వెల్లిన ఘటనలు గుర్తుకు వచ్చినప్పుడు ..
"ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో…
ఎదను తడిమింది చూడు… చినుకంటి చిన్నదేమో…
మైమరచిపోయా మాయలో…
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా…. || ఎదుట ||
నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి…
కలే ఐతె ఆ నిజం… ఎలా తట్టుకోవాలీ…..
అవునో కాదో అడగకంది నా మౌనం….
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం….
చెలిమి బంధం అల్లుకుందే… జన్మ ఖైదులా… || ఎదుట ||
నిన్నే చేరుకోలేకా… ఎటెళ్ళిందో నా లేఖ…
వినేవారు లేకా…. విసుక్కుంది నా కేకా…
నీదో… కాదో… వ్రాసున్న చిరునామా
ఉందో… లేదో… ఆచొట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా… || ఎదుట ||
చూసారా ఎంత బాగుందో మనసును కదిలించే పదాలు..పాట ఆద్యాంతం ఉన్నాయి పదాలకు తగ్గట్టు మంచి మ్యూజిక్ ఎక్కడికో తిసుకెలుతు మననుని నిజంగానే కెలికినట్టు అనిపిస్తుంది కదా..?ఆ పాటతాలూక వీడియోను మీరు చూడండి నామనసును తట్టే మరో మంచి సాంగ్