Friday, January 14, 2011
ఆ అక్షరాలే దూరం అయిన మనస్సులను ఒక్కటి చేస్తాయి
అక్షరాలు పువ్వులు నువ్వు నన్ను ప్రేమించినపుడు
అక్షరాలే కత్తులు అవుతాయి నువ్వు తిట్టినపుడు
అక్షరాలు విన్పించని రాగాలు నీ విరహంలో
ఆ అక్షరాలే దూరం అయిన మనస్సులను ఒక్కటి చేస్తాయి
అక్షరాలే నీ జీవితం చాలాసార్లు ..పాత జ్ఞపకాలను గుర్తుకు తెస్తాయి
అక్షరాలు అవసం లేదు ఒక్క నీ మనసు సమక్షంలో
అక్షరాలు అవసరం లేదు భావం మనస్సులోఉంటే..
అక్షరాలే కొన్ని సార్లు మనసును సేదతీర్చేలా చేస్తాయి
అక్షరాలు భాదకు పైపూతలే గుండెల్లో భాతను అవి తీర్చలేవు..
అక్షరాల మాలను పేర్చి మనస్సును గెలవలనుకోవడం పిచ్చేనేమో..
అక్షరాలతో దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నట్టు చెప్పొచ్చు
పెదవులతో చెప్పలేని భావాలను అక్షరలు గా పేర్చి చెప్పొచ్చు
అక్షరాలతో అన్నీ చేయలేకపోయినా కొన్నిటికి అక్షరాలే మాద్యిమాలు
అక్షరాలే కొత్త బందాలను ఎర్పాటు చేసి మనసును మైమరపిస్తాయి
అక్షరాలను అందంగా మార్చి ఎదుటివారిలో మన భావాన్ని మాత్రం వ్యక్తం చేయగలం..