పరిచయంలేని అపరిచితుల వద్దే మనసు విప్పాలనిపిస్తుంది
సమాధానం కన్నా మౌనమే చాలనిపిస్తుంది
కళ్ళు మూసుకుని గుడ్దిగా నమ్మాలనిపిస్తుంది
కొన్ని గతాలకు మరపే ముగింపనిపిస్తుంది
నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది
మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది
నిజం కన్నా అబధ్ధమే వినాలనిపిస్తుంది
వేదనలో హాయికై వెతకాలనిపిస్తుంది
మాటల కన్నా మౌనమే మేలనిపిస్తుంది...!!
http://trishnaventa.blogspot.com/ లోని పదాలు వాడాను