Saturday, January 29, 2011
జన్మనిచ్చిన తల్లిదండ్రులు లను..ఉంచుకునేందుకు జాగే లేదట..!
వ్యంగ్యం కాదిది వాస్తవం
జన్మనిచ్చిన తల్లిదండ్రులు
జవసత్వాలు కొల్పోతే
ఉంచుకునేందుకు జాగే లేదట..!
వాల్లుండేదే అద్దె కొంపట..!!
చేవ లేక,చావ లేక
చెంగు బట్టి యాచించలేక
మూలమలుపున ముసలి అవ్వ మూలుగుతుంటే
అయ్యో!సిగరెట్ కే చిల్లర సాలవట..!
చిరాగ్గా ఇదేం గోలట..!!
కన్నరుణం తీర్చాలంటే కష్టకాలం కరగాలా...?
మానవత్వం చూపాలంటే సొంత కడుపు నిండాలా..?
కరుడు కట్టిందా సమాజం
కరుణను ఎరుగనిదా మన బీజం
నొట్లో బూడిద కొట్టి,చేతిలో లింగం పెట్టి
చెవిలో పువ్వుని జొప్పించిన, దొంగ స్వాముల
దర్శనం పొందిన వాని జన్మే దన్యమట..!
ధనమొదిల్చిన వాడికే మోక్షమట..!
మనసులోని మలినం మాయతోనే పొతుందా..?
మాయమైన మనిషితనం మర్మంగానే వస్తుందా..?
విజ్ఞానం మరచిందా సమాజం
వివేకం ఎరుగనిదా మన బీజం
Labels:
కవితలు