నన్ను నిదురకు దూరం చేసింది జ్ఞాపకం
ఆ జ్ఞాపకం గతం లోకితొంగి చూస్తూ...
పదే పదే మది తలుపుతు తడుతున్నాయి...
మూగపోయిన నీపలుకులు ఘనీబవించాయి మిత్రమా..?
గతంలో నీ మాటలు తీయని తేనె తుంపరులై మనసును తడిపాయి..
వర్తమానం లో ఆ తుంపరుల కోసం ఎంత వెతికినా జాడేలేదు మిత్రమా..
గతంతాలూకా నీజ్ఞాపకం ఎంత బాగుంది మిత్రమా..
వర్తమానంలో అన్నీ కోల్పోయి విషాదంలో ఉన్నాను..
గతంలేని వర్తమానాన్ని నేను జీర్నించుకోలేకపోతున్నా మిత్రమా..