Friday, January 21, 2011
మరీ చిన్న చిన్న విషయాలకు సంతోషపడవల్సి వస్తుంది..
ఎంటో ఎప్పుడూ కాంప్రమైజ్ కాని నేను కావల్సి వస్తుంది..
మరీ చిన్న చిన్న విషయాలకు సంతోషపడవల్సి వస్తుంది..
ఏదో చేయాలని ఉందికాని...నీకిష్టంలేదు అన్నావని కాం అవుతున్నా..
ఎన్నాళ్ళిలా ,ఎన్నేళ్ళిలా నీకు దూరంగా ..మనసు బారంగా..
కనిపించగానే గుండెవేగం పెరిగింది కాని మనసులో మాట పెగల్లేదు ..
మౌనం బరించడం చాలా కష్టం అని కష్టంగా తెలుస్తోంది మిత్రమా..?
ఒక్కసారిగా కళ్ళలో నీరు గిర్రున తిరిగాయి..కష్టంగా ఆపుకున్నా
తెలిసిన స్నేహితులు కనిపిస్తే ..గల గల మాట్లాడే నేను..పదాలు పెదవి దాటలేదు
ఇలా నిన్ను దూరంగా ఎవ్వరో తెలీని వాడిలా చూడవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు మిత్రమా..
మళ్ళీగతం ఎందుకు తిరిగి రాకూడదు..అని పదే పదే మనసు అడుగుతుంటే సమాదానం ఏమని చెప్పాలి మిత్రమా..?
Labels:
కవితలు