Sunday, January 30, 2011
ఇంతా చేసి చివరకు ఏమి మిగిల్చావు..?
అమావాశ్య రాతిరిలో వెన్నెల వై వచ్చావు,
నడిరేయి జాములోకి వేకువలా వచ్చావు
ఆశలేని జీవితాన అందమైన స్వప్నమా
రంగు లేని మనసులోకి హరివిల్లు వై వచ్చావు
రాగం లేని బ్రతుకున అనురాగమే దిద్దావు
యడారి వంటి మనసున తొలి చినుకువై కురిశావు,
అర్థరహిత జీవితాన అందమైన భావమా
అందనంత దూరానికి స్వర్గమే తెచ్చావు
తడి ఆరిన పెదవులని అమ్రుతమై తదిపావు
నీరెరుగని యేరులోకి గంగవలే వచ్చావు
శిశిరంలో వసంతమా, నా యెదలోని రాగమా
పదం లేని పాటలోకి పల్లవివై వచ్చావు
ఇంతా చేసి చివరకు ఏమి మిగిల్చావు..?
కంటినిండా కన్నీరు..మనసునిండా చెప్పుకోలేని భాద..
ఇప్పుడనిపిస్తుంది..నీవెందుకు పరిచయం అయ్యావాని..
అసలెందుకు నాజీవితంలోకి ప్రవేసించావాఅని..
అసలేంజరగనట్టు ఉంటున్న నిన్ను చూసి ..ఎం అనాలో తెలియడంలేదు
ఇలా మర్చిపోవడం నీకు చేతనౌతుంది నావల్లకాదు..
అయినా ఎందుకో..ఇప్పటికీ నివంటే..?
Labels:
కవితలు