Tuesday, January 25, 2011
ఇక్కడ కన్నీళ్ళలో నా గుండె స్నానం చేస్తోంది ....
నవ్వుతావు ఎందుకు మిత్రమా ...
ఇక్కడ కన్నీళ్ళలో నా గుండె స్నానం చేస్తోంది ....
హృదయం ఎడారిగా మారింది
నీవు నన్ను మర్చిపోఅని తేలికగానే అన్నావు
అసలు ఎందుకు నాజీతంలోకి వచ్చావు,వెలుతున్నావు
అది నాకు సాద్యం అయ్యేపని కాదని నీ మనసుకు తెలుసు
నాతో మాట్లాడ వద్దు అన్నమాట నీవు ఎలా అనగలిగావోగాని
అది నీకు సాద్యమేమోగాని నాకు అస్సలు సాద్యింకాదు
అన్నీ నీ ఇష్టమేనా హ్రుదయంలోకి రావడం వరకే నీ ఇష్టం
నా జీవితంలోనుంచి నీవు నన్ను వెలివేసినా నా హృదయంలో నిలిచిపోయిన...
నిన్ను నేనేలా మర్చిపోను మిత్రమా..
మనసు సంద్రమైంది నీ జ్ఞాపకం తోడేస్తోంది నిన్ను విడిచి ఉండలేను
నీ ఊపిరి నా గుండెను తడుముతోంటే
నేను గాలై నీ నులి వెచ్చని పాదాలను తాకుతూ నీ పెదవుల మీద మాటనై వుండిపోతా
నన్ను మన్నించు నీ కోసం వేచి వున్నా..మౌనంగా రోదిస్తూ
నీ మనసులో చోటివ్వక పోయినా కనీసం నీ జ్ఞాపకంలోనైనా నన్ను తనువు చాలించనీ ...