Sunday, January 23, 2011
మనసు శరీరాన్ని ప్రణయస్పర్శలతో ఎంత హాయిగా మీటినా
మనసు నీ శరీరాన్ని ప్రణయస్పర్శలతో ఎంత హాయిగా మీటినా
నా స్పర్శకి నీ హృదయపు లోతుల్లో ప్రేమరాగం కలగలేదు
మానసగీతం యొక్క సంగీతమాధుర్యం వినపడనప్పుడు
మరి, ఆ ప్రణయగీతానికి దేహస్వరాన్ని నీకివ్వనా?
బహుశా, నా తనువు కౌగిలియొక్క స్వభావం నీకు నచ్చలేదేమో!
ప్రేమ మనసుని ప్రణయభావాలతో ఆనందంగా కదిలించినా
నా భావాలకి నా గుండెలోతుల్లో ప్రేమనాదం పలకలేదు
ప్రేమగేయం యొక్క ప్రణవలావణ్యం కనబడనప్పుడు
మరి, ఆ ప్రణయగేయానికి ప్రేమకవిత్వాన్ని ఎలా అందిచగలవు?
బహుశా, నా మనసుకి గుండె యొక్క నిశ్శబ్దం నీకు నచ్చిందేమో!
స్నేహం ఇంద్రియాల్ని ప్రణయరాగంతో అద్బుతంగా ఆకర్షించినా
ఆ రాగానికి నీ అంతరాత్మలోలోపల రసానుభూతి కలగలేదు
స్నేహకావ్యం యొక్క జీవనసాహిత్యం కనబడనప్పుడు
మరి, ఆ ప్రణయరాగానికి మిత్రవైత్రిని ఎలా కన పరుస్తావు నీవు?
బహుశా, నీ ఇంద్రియాలకి అనురాగపు ప్రభావం నచ్చలేదేమో!
Labels:
కవితలు